'మాచర్ల ధమ్కీ' .. ధర్మాన్ని కాపాడటం కోసం నా సమాధిని పునాదిగా చేస్తా

Dhamki video from Macharla Niyojakavargam Movie out.యంగ్ హీరో నితిన్ న‌టించిన తాజా చిత్రం మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 July 2022 1:23 PM IST
మాచర్ల ధమ్కీ .. ధర్మాన్ని కాపాడటం కోసం నా సమాధిని పునాదిగా చేస్తా

యంగ్ హీరో నితిన్ న‌టించిన తాజా చిత్రం 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం'. ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎంఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, కేథరిన్ థ్రెస్సా క‌థానాయిక‌లుగా న‌టించారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తుండగా తమిళ నటుడు సముద్రఖని ఓ కీల‌క పాత్ర‌ను పోషించాడు. ఆగ‌స్టు 12న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన టీజ‌ర్‌, ప్రొమోల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం యాక్షన్ ధమ్కీ పేరుతో ఓ స్పెషల్ వీడియో గ్లింప్స్‌ను విడుద‌ల చేసింది. 'మహాభారతంలో ధర్మాన్ని కాపాడటం కోసం లక్షలాదిమంది తమ సమాధులను పునాదులుగా వేశారు. మాచర్ల నియోజక వర్గంలో ధర్మాన్ని కాపాడటం కోసం నా సమాధిని పునాదిగా వేయడానికి నేను సిద్ధం' అంటూ ఈ వీడియో సాగింది. ఇక ఈ చిత్ర ట్రైల‌ర్ ను ఈనెల 30న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెర‌కెక్కింది. 'చెక్', 'రంగ్ దే', 'మాస్ట్రో' చిత్రాలు ఆశించిన ఫ‌లితాలు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఈ చిత్రంపై నితిన్ భారీ ఆశ‌ల‌నే పెట్టుకున్నాడు.

Next Story