'ధ‌మాకా' ఓటీటీ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

Dhamaka to stream on Netflix from January 22.మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన చిత్రం 'ధమాకా'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jan 2023 2:55 PM IST
ధ‌మాకా ఓటీటీ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన చిత్రం "ధమాకా". త్రినాద్ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న శ్రీలీల న‌టించింది. 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' 'అభిషేక్ పిక్చర్స్' బ్యానర్ల పై టి జి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. మాస్ యాక్షర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది.

ర‌వితేజ ఎన‌ర్జీ, కామెడీకి తోడు శ్రీలీల డ్యాన్స్ ప్రేక్ష‌కులకు న‌చ్చేశాయి. సంక్రాంతి వ‌ర‌కు పెద్ద చిత్రాలు ఏవీ విడుద‌ల కాక‌పోవ‌డం ఈ చిత్రానికి బాగా క‌లిసివ‌చ్చింది. మిక్స్‌డ్ టాక్ వ‌చ్చినా కూడా ఇప్ప‌టికి థియేట‌ర్ల వ‌ద్ద క‌లెక్ష‌న్లు స్ట‌డీగా ఉన్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 18 రోజుల్లో 108 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుద‌ల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో వారికి ఇది శుభ‌వార్త‌. ఈ చిత్ర ఓటీటీ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని ఎప్పుడు స్ట్రీమింగ్ చేయ‌నుందో చెప్పేసింది. జ‌న‌వ‌రి 22 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. దీంతో ర‌వితేజ ఫ్యాన్స్ పుల్ హ్యాపీ అవుతున్నారు.

Next Story