పుల్ ప‌టాసుల పేలిన 'ధ‌మాకా' టీజ‌ర్‌.. 'యాక్ష‌న్‌లోకి దిగితే నేనొక శాడిస్ట్‌ని'

Dhamaka movie teaser released.మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న చిత్రం ధ‌మాకా.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Oct 2022 12:16 PM IST
పుల్ ప‌టాసుల పేలిన ధ‌మాకా టీజ‌ర్‌.. యాక్ష‌న్‌లోకి దిగితే నేనొక శాడిస్ట్‌ని

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న చిత్రం 'ధ‌మాకా'. త్రినాథ్ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న పెళ్లి సంద‌డి ఫేమ్ శ్రీలీల న‌టిస్తోంది. దీపావ‌ళి సంద‌ర్భంగా చిత్రం బృందం నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

'నేను నీలో ఒక విల‌న్‌ని చూస్తే.. నువ్వు నాలోని హీరోని చూస్తావు. కానీ.. యాక్ష‌న్‌లోకి దిగిన‌ప్ప‌డు నేనొక శాడిస్ట్' అంటూ ర‌వితేజ చెబుతున్న డైలాగ్‌తో టీజ‌ర్ మొద‌ల‌వుతుంది. టీజ‌ర్ చివ‌ర‌ల్లో 'అటు నుంచి ఒక బుల్లెట్ వ‌స్తే ఇటు నుంచి దీపావ‌ళే' అనే డైలాగ్ తో ఎండ్ చేసి దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక ఈ చిత్రం క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్న‌ట్లు చెప్పారు.

స‌చిన్ ఖేడేక‌ర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, రావు ర‌మేశ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్ర టీజ‌ర్ సినిమా పై అంచ‌నాలు పెంచేసింది. భీమ్స్ సిసిరోలియలో నేపథ్య సంగీతం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Next Story