'దేవర' బ్లాక్ బస్టర్ అని చెప్పేశాడుగా.!

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా ఉన్నాడు. జైలర్, జవాన్, లియో సినిమాల రిలీజ్ కు ముందు సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయని చెప్పాడు.

By Medi Samrat  Published on  23 Sept 2024 11:46 AM IST
దేవర బ్లాక్ బస్టర్ అని చెప్పేశాడుగా.!

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా ఉన్నాడు. జైలర్, జవాన్, లియో సినిమాల రిలీజ్ కు ముందు సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయని చెప్పాడు. రిలీజ్ అయ్యాక జనం కూడా అదే ఫలితాన్ని ఇచ్చారు. తాజాగా మరోసారి అదే విధంగా అనిరుధ్ ప్రకటించాడు. దేవర బ్లాక్ బస్టర్ అవుతుందని అనిరుధ్ ప్రకటించేశాడు. గతంలో అనిరుధ్ ట్వీట్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు దేవరకు కూడా ఇదే జరుగుతుందని అభిమానులు, ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ సినిమా రిజల్ట్‌పై దేవర టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది.

దేవర ఈ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. సెన్సార్‌ సర్టిఫికేషన్‌, లాంఛనాలు అన్నీ పూర్తయ్యాయి. సినిమా రన్‌టైమ్ కూడా 2 గంటల 45 నిమిషాలకు లాక్ అయిందని అంటున్నారు. దేవర రిలీజ్ ట్రైలర్ కు కూడా సంచలన రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన ట్రైలర్‌కి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా మంచి స్పందన వస్తోంది. ఇక అనిరుధ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన మ్యూజిక్ తో సందడి చేస్తాడని ఆశించగా.. భారీగా అభిమానులు రావడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేయాల్సి వచ్చింది.

Next Story