దసరా సెలవుల్లో దేవర కలెక్షన్ల జాతర
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు దేవర
By Medi Samrat Published on 13 Oct 2024 4:44 PM ISTబాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు దేవర. దసరా హాలీడేస్ లో థియేటర్లు చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే 400 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. బాహుబలి 1 రికార్డులను కూడా దేవర బద్దలుకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బాహుబలి 1 తెలుగు వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా 184 కోట్ల షేర్ సాధించింది. గతంలో అత్తారింటికి దారేది సినిమా నెలకొల్పిన ఇండస్ట్రీ రికార్డును రెట్టింపు తేడాతో బాహుబలి 1 బద్దలు కొట్టింది. దేవర షేర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 180 కోట్లకు చేరుకుంది. బాహుబలి నెలకొల్పిన రికార్డులను దర్శకధీరుడు రాజమౌళి బద్దలు కొట్టాడు. బాహుబలి 2, ఆర్‌ఆర్‌ఆర్‌తో రికార్డు షేర్ సాధించాడు. కానీ రాజమౌళి ప్రమేయం లేకుండా ప్రభాస్ నటించిన సలార్.. బాహుబలి 1 కలెక్షన్స్ ను దాటేసింది. తెలుగులో 200 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఈ రికార్డును ప్రభాస్ తన ఇటీవలి కల్కి 2898 ADతో మళ్లీ బద్దలు కొట్టాడు. ఇప్పుడు ప్రభాస్, రాజమౌళి ప్రమేయం లేకుండా బాహుబలి 1 ని బ్రేక్ చేయబోతున్నాడు ఎన్టీఆర్.
Next Story