ఈ రేంజిలో దుమ్ము దులిపేస్తున్నావేంది 'దేవర'
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలో హీరోగా కనిపించి చాలా రోజులే అయింది. ఆయన అభిమానులు 'దేవర' సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు.
By అంజి Published on 18 Aug 2024 8:45 PM ISTఈ రేంజిలో దుమ్ము దులిపేస్తున్నావేంది దేవర
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలో హీరోగా కనిపించి చాలా రోజులే అయింది. ఆయన అభిమానులు 'దేవర' సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి పోస్టర్స్ దగ్గర నుండి ట్రైలర్లు, సాంగ్స్ ఇన్స్టంట్ హిట్ గా నిలుస్తున్నాయి. ఇప్పటికే టీజర్ కు ఊహించని స్పందన రాగా.. ఫియర్ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే వీటన్నింటినీ మించి 'చుట్టమల్లె' సాంగ్ చార్ట్ బస్టర్ అయింది.
ఇటీవల విడుదలైన చుట్టమల్లె లిరికల్ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. అనిరుధ్ రవిచందర్ అందించిన సోల్ ఫుల్ కంపోషన్‌తో ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాట యూట్యూబ్‌లో విడుదలైనప్పటి నుండి ట్రెండింగ్‌లో ఉంది. చుట్టమల్లె యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్‌ను కూడా సాధించింది. తెలుగు వెర్షన్‌లో చుట్టమల్లె ఇప్పటికీ 73 మిలియన్ వ్యూస్‌తో నంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. హిందీ వెర్షన్ కూడా 22 మిలియన్ల వ్యూస్ ను పొందింది. తమిళ వెర్షన్ 5 మిలియన్ల వ్యూస్ సాధించగా.. కన్నడ, మలయాళ వెర్షన్లు 2 మిలియన్ వ్యూస్‌ని సాధించాయి. ఈ పాటకు ఇప్పటి వరకు 104 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
దేవర సినిమా మొదటి లిరికల్ ఫియర్ సాంగ్ విడుదలైన తర్వాత పెద్ద సంచలనంగా మారింది. ఇక ఇప్పుడు చుట్టమల్లెతో సినిమాకు హైప్ మరింత పెరిగింది. మూడో లిరికల్ సాంగ్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవర సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. షూటింగ్ చివరి దశకు చేరుకుంది.