గుంటూరు కారం.. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు ఇవే!!

మహేష్ బాబు, త్రివిక్రమ్ ల ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ జనవరి 12 నుండి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.

By Medi Samrat  Published on  2 Jan 2024 6:00 PM IST
Guntur Karam, trailer, pre-release event, mahesh babu,

గుంటూరు కారం.. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు ఇవే!!

గుంటూరు కారం ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరగుతోంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ ల ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ జనవరి 12 నుండి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. గుంటూరు కారం ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు బయటకు వచ్చాయి. జనవరి 6న సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కన్ఫర్మ్ చేశారు.. అదే రోజు ట్రైలర్‌ని కూడా విడుదల చేయనున్నారు. హైదరాబాద్ లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం నిర్వహించాలని భావిస్తూ ఉన్నారు. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా కావడంతో ట్రైలర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్ టైనర్ రాబోతోంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు బాగా పనిచేసింది. మహేష్ బాబు లుక్స్, సినిమా గ్లింప్స్, దమ్ మసాలా సాంగ్, కుర్చీ మడతపెట్టి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి ఇప్పటికే తగినంత బజ్ ఉంది. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమాపై మరింత బజ్ పెంచనున్నాయి.

Next Story