కాలికి గాయమైనప్పటికీ 'పొన్నియిన్ సెల్వన్ 1' సక్సెస్ పార్టీకి హాజ‌రైన‌ త్రిష‌

Despite a leg injury Trisha attends 'Ponniyin Selvan 1' success party.త్రిష.. ప‌రిచ‌యం అక్క‌ర లేని పేరు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Nov 2022 1:25 PM IST
కాలికి గాయమైనప్పటికీ  పొన్నియిన్ సెల్వన్ 1 సక్సెస్ పార్టీకి హాజ‌రైన‌ త్రిష‌

త్రిష.. ప‌రిచ‌యం అక్క‌ర లేని పేరు. రెండు ద‌శాబ్దాల‌కు పైగా త‌న అందం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల మ‌దిలో చెద‌ర‌ని ముద్ర వేసింది. అభిమానులు అంద‌రూ త్రిష‌ను ముద్దుగా 'సౌత్ క్వీన్' అని పిలుచుకుంటారు. ఇటీవ‌లే మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'పొన్నియన్‌ సెల్వన్' చిత్రంలో న‌టించింది. ఈ చిత్ర ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డంతో త్రిష ఆనందానికి అవ‌ధులు లేవు. ఈ చిత్రంలో 'కుందవై' పాత్రలో త్రిష న‌ట‌న అద్భుతం.

కాలికి ఫ్రాక్చ‌ర్‌..

త్రిష కొద్ది రోజుల క్రితం ఫారిన్ టూర్‌కి వెళ్లింది. అయితో అనుకోకుండా కింద ప‌డ‌డంతో కాలు విరిగింది. దీంతో టూర్‌ను అర్థాంత‌రంగా ర‌ద్దు చేసుకుని స్వ‌దేశానికి తిరిగివ‌చ్చింది. అనంత‌రం త‌న కాలికి క‌ట్టు క‌ట్టిన ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి జ‌రిగిన విష‌యాన్ని చెప్పింది. ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.


ఇదిలా ఉంటే.. పొన్నియన్‌ సెల్వన్ చిత్రం ఘ‌న విజ‌యం సాధించ‌డంతో చిత్ర‌బృందం థాంక్స్ గివింగ్ మీటింగ్ ను నిర్వ‌హించ‌నుంది. కాలి గాయంతో బాధ‌పడుతున్న‌ప్ప‌టికి త్రిష ఈ పార్టీకి హాజ‌రైంది. ఈపార్టీలో త్రిష కాస్ట్యూమ్ డిజైనర్‌తో క‌లిసి దిగిన‌ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఏప్రిల్ 28, 2023న పొన్నియిన్ సెల్వ‌న్ రెండో భాగం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story