నేను హీరోయిన్‌గా చేస్తున్నానా..? నాకు తెలీదే
Deepthi Sunaina condemns debut as Heroine.సోషల్ మీడియా స్టార్, బిగ్‌బాస్ బ్యూటీ దీప్తిసునయన గురించి
By తోట వంశీ కుమార్ Published on
25 Jan 2022 9:43 AM GMT

సోషల్ మీడియా స్టార్, బిగ్‌బాస్ బ్యూటీ దీప్తిసునయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్‌గా ఉంటుంది. తన ప్రొఫెషన్, పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇక ఇటీవల షణ్ముఖ్‌తో విడిపోయినట్లు కూడా ప్రకటించింది. తమ 8 ఏళ్ల ప్రేమ బంధానికి తెరపడినట్లు చెప్పింది.
ఇదిలా ఉంటే.. దీప్తి సునయన త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే వీటిపై దీప్తి సునయన స్పందించింది. అది ఫేక్ అంటూ కొట్టి పారేసింది. నాకు తెలీదే ఇది అంటూ కౌంటర్ వేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫోటోను షేర్ చేసింది. మొత్తానికి దీప్తి సునయన సిల్కర్ స్క్రీన్‌కు పరిచయం కానుందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. దీంతో ఆమె అభిమానులు కాస్త బాధపడుతున్నారు. దీప్తిని హీరోయిన్‌గా చూడాలని ఉందంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. మరీ దీప్తి వీటిపై ఎలా స్పందిస్తుందో చూడాలి మరీ
Next Story