విడిపోతున్నట్లు ప్ర‌క‌టించిన దీప్తి సున‌య‌న‌.. ఆ హ‌క్కు ఉంద‌న్న‌ ష‌ణ్ముఖ్‌

Deepthi Sunaina announces break up with Shanmukh.యూట్యూబ్ స్టార్స్, బిగ్‌బాస్ ఫేమ్ దీప్తి సున‌య‌న‌, ష‌ణ్ముఖ్ లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jan 2022 9:16 AM GMT
విడిపోతున్నట్లు ప్ర‌క‌టించిన దీప్తి సున‌య‌న‌.. ఆ హ‌క్కు ఉంద‌న్న‌ ష‌ణ్ముఖ్‌

యూట్యూబ్ స్టార్స్, బిగ్‌బాస్ ఫేమ్ దీప్తి సున‌య‌న‌, ష‌ణ్ముఖ్ లు విడిపోతున్నార‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ వార్త‌లు నిజ‌మేన‌ని దీప్తి సున‌య‌న చెప్పేసింది. త‌మ ప్రేమ బంధానికి పుల్‌స్టాప్ పెడుతున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది. దీంతో 5 ఏళ్ల వీరి బంధానికి తెర‌పడింది.

"నా శ్రేయోభిలాషులు, స్నేహితులందరికీ.. ఎంతో ఆలోచించిన తర్వాత నేను, ష‌ణ్ముఖ్ విడిపోవాల‌ని ప‌ర‌స్ప‌ర నిర్ణ‌యం తీసుకున్నాం. దీనిపై ఎంతో కాలంగా చ‌ర్చించుకున్నాం. మా ప్రేమ బంధం నుంచి విడిపోయి.. మా దారులు మేము చూసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాం. మేము ఇద్ద‌రం క‌లిసి ఉండ‌డానికి ఎంతో ప్ర‌య‌త్నించాం. అయితే నిజ జీవితాన్ని విస్మ‌రించాం. మా దారులు వేర‌ని అర్థ‌మైంది. ఇలాంటి క్లిష్ణ ప‌రిస్థితుల్లో మాకు మీ అండ ఎంతో అవ‌స‌రం. ద‌య‌చేసి మా వ్య‌క్తిగ‌త స్వేచ్చ‌కు భంగం క‌లిగించ‌ర‌ని కోరుకుంటున్నాం. అంటూ దీప్తి సున‌య‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.

బ్రేక‌ప్ పై స్పందించిన ష‌ణ్ముఖ్‌..

విడిపోతున్నాం అంటూ దీప్తి సున‌య‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ ష‌ణ్ముఖ్ చాలా సేప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. ఎట్ట‌కేల‌కు త‌ను మౌనం వీడాడు. 'ఆమెకు నిర్ణయం తీసుకునే హక్కుంది. తను ఇప్పటివరకు చాలా ఫేస్‌ చేసింది. ఇప్పటికైనా ఆమె సంతోషంగా, పీస్‌ఫుల్‌గా ఉండాలని నేను కోరుకుంటున్నా. మా దారులు వేరైనా స్నేహితులుగా కలిసుంటాం. నేను బెటర్‌ పర్సన్‌ అయ్యేందుకు ఈ 5 సంవత్సరాలు నువ్వు అందించిన సహాయానికి ధన్యవాదాలు. నువ్వు సంతోషంగా ఉండాలి. ఆల్‌ ది బెస్ట్‌ దీపూ'.. అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు.


కాగా.. వీరిద్ద‌రి బ్రేకప్‌కి బిగ్‌బాస్ హౌస్‌లో సిరితో ష‌ణ్ముఖ్ క్లోజ్‌గా ఉండ‌డం అని తెలుస్తోంది. ఫ్రెండిప్‌ అంటూనే వీరిద్దరు చేసిన అతి చాలామందికి నచ్చలేదు.

Next Story
Share it