రెమ్యునరేషన్ తీసుకోని దీపిక
దీపికా పదుకోన్ 2007లో 'ఓం శాంతి ఓం' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
By Medi Samrat Published on 15 Sept 2023 8:45 PM ISTదీపికా పదుకోన్ 2007లో 'ఓం శాంతి ఓం' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. షారుఖ్ ఖాన్ ఆమె మొదటి హీరో. ఈ హిట్ పెయిర్ హ్యాపీ న్యూ ఇయర్, చెన్నై ఎక్స్‌ప్రెస్ వంటి అనేక విజయవంతమైన ప్రాజెక్ట్‌లలో కలిసి పనిచేశారు. 2023లో అతిపెద్ద హిట్ అయిన పఠాన్ లో కూడా వీరిద్దరూ కలిసి కనిపించారు. ఇక షారుఖ్ ఖాన్ తాజా బ్లాక్‌బస్టర్ జవాన్‌లో దీపిక ప్రత్యేక పాత్రలో నటించింది. దీపికా అతిధి పాత్రలో నటించింది. మంచి ఇంపాక్ట్ ఉన్న పాత్రలో తనదైన శైలిలో నటించింది దీపిక. అయితే ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా దీపిక తీసుకోలేదు. జవాన్‌లో ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా పనిచేశానని తెలిపింది. ఇటీవలి ఇంటర్వ్యూలో, దీపికా తాను స్పెషల్ అప్పియరెన్స్ విషయంలో ఎటువంటి రెమ్యునరేషన్ వసూలు చేయనని తెలిపింది. జవాన్‌లో కూడా ఎటువంటి రెమ్యునరేషన్ లేకుండా పనిచేశానని దీపికా చెప్పింది.
జవాన్ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ అయి భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుఖ్ డ్యుయల్ రోల్ చేశారు. దీపికా క్యామియో చేయగా.. నయనతార హీరోయిన్‍గా నటించింది. 8 రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్త కలెక్షన్లు రూ.684.71 కోట్లకు చేరాయి. భారత్‍లో జవాన్ మూవీ నెట్ కలెక్షన్లు రూ.400 కోట్లను చేరింది. 8 రోజుల్లో దేశంలో ఈ సినిమా రూ.388.72 కోట్ల వసూళ్లను రాబట్టింది. రూ.400కోట్ల మైలురాయికి చేరువైంది.