అభిమానుల మ‌ధ్య‌లో దీపిక ప‌దుకొణే.. హ్యాండ్ బ్యాగ్ దొంగిలించే య‌త్నం..!

Deepika Padukone Mobbed by Fans.సినీతార‌ల‌కు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Feb 2021 3:15 PM IST
అభిమానుల మ‌ధ్య‌లో దీపిక ప‌దుకొణే.. హ్యాండ్ బ్యాగ్ దొంగిలించే య‌త్నం..!

సినీతార‌ల‌కు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. వారు బ‌య‌ట క‌నిపిస్తే చాలు అభిమానులు వారిని చూసేందుకు ఎగ‌బ‌డుతుంటారు. దేశ విదేశాల్లో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొనేకు తాజాగా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితి ఎద‌రైంది. దీపిక డిన్న‌ర్ కోసం ముంబైలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. దీపిక రెస్టారెంట్‌కు వ‌చ్చిన‌ట్లు తెలుసుకున్న అభిమానులు ఆమెను చూసేందుకు రెస్టారెంట్‌కు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

అమ్మ‌డు రెస్టారెంట్ నుండి బ‌య‌ట‌‌కు వ‌స్తుండ‌గా.. కొంద‌రు అభిమానులు ఆమెతో ఫొటో కోసం ఎగ‌బ‌డ్డారు. జనాల మధ్య నుంచి బాడీగార్డుల సహాయంతో దీపిక కారు ఎక్కేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో ఓ అభిమాని దీపిక హ్యాండ్ బ్యాగ్‌ను లాక్కునేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. ఆమె ఒక అడుగు వెన‌క్కి వేసింది. అనంత‌రం బ్యాగ్‌ను జాగ్ర‌త్త‌గా చేసుకుని కారు వద్ద‌కు చేరుకుంది. అక్క‌డి నుంచి న‌వ్వుతూ వెళ్లిపోయింది. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. తనను చుట్టుముట్టిన వారి నుంచి తప్పించుకునే క్రమంలో దీపిక‌ 'ఏక్ మినిట్.. ఏక్ మినిట్' అంటూ ఉండటం వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం దీపిక త‌న భ‌ర్త ర‌ణ‌వీర్ సింగ్ కు జోడిగా 83 చిత్రంలో న‌టిస్తోంది. షారుఖ్‌ ఖాన్‌తో 'పఠాన్‌', హృతిక్‌ రోషన్‌తో 'ఫైటర్‌' మూవీతో పాటు ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ చిత్రంలోనూ నటిస్తోంది.




Next Story