ఆస్కార్ 2023 ప్రెజెంటర్‌గా దీపికా పదుకుణె

మార్చి 13న జరగనున్న ఆస్కార్‌ వేడుకలో దీపికా ప‌దుకుణె అవార్డ్స్‌ ప్రజెంటర్‌ వ్యవహరించబోతున్నారు.

By అంజి  Published on  3 March 2023 1:19 PM IST
Deepika Padukone, Oscars 2023

హీరోయిన్ దీపికా పదుకుణె (ఫైల్‌ ఫొటో)

బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా ప‌దుకుణెకు అరుదైన అవకాశం దక్కింది. ఆస్కార్‌ వేడుకలో దీపికా పదుకొణె సందడి చేయబోతున్నారు. మార్చి 13న జరగనున్న ఆస్కార్‌ వేడుకలో దీపికా ప‌దుకుణె అవార్డ్స్‌ ప్రజెంటర్‌ వ్యవహరించబోతున్నారు. ఈ సంవత్సరం భారత్‌ నుంచి ఈ ఘనతను సొంతం చేసుకున్న ఏకైక నటి దీపికా ప‌దుకుణె. ఆస్కార్‌ అవార్డ్స్‌ ప్రజెంటర్స్‌ జాబితాను నిర్వహకులు విడుదల చేశారు. ఈ లిస్ట్‌లో డ్వేన్ జాన్స‌న్‌, ఎమిలీ బ్లంట్‌, రిజ్ అహ్మ‌ద్‌, శ్యామూల్ ఎల్ జాక్స‌న్‌, గ్లెన్ క్లోజ్‌, మైఖేల్ బి జోర్డాన్‌, జోనాథ‌న్ మేజ‌ర్స్ వంటి హాలీవుడ్ న‌టీమ‌ణుల‌తో క‌లిసి దీపికా ప‌దుకుణేకు అవకాశం వచ్చింది.

ఆస్కార్‌ విజేత‌ల‌కు హాలీవుడ్‌ దిగ్గ‌జ న‌టుల‌తో క‌లిసి దీపికా ప‌దుకుణె అవార్డ్స్ ప్ర‌జెంట్ చేయ‌బోతోంది. ఆస్కార్ అవార్డ్స్ ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న రెండో భారత న‌టిగా దీపికా ప‌దుకుణె నిల‌వ‌నుంది. 2016 ఆస్కార్స్ ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ విజేత‌గా అవార్డును అంద‌జేసింది. గురువారం రాత్రి దీపిక ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి సంబంధించిన పోస్ట్‌ను షేర్‌ చేసింది. దీంతో నెటిజన్లు దీపిక కామెంట్ సెక్షన్‌ను అభినందనలతో ముంచెత్తారు. "నీ దీపూని చూడటానికి వేచి ఉండలేను" అని నటి నేహా ధూపియా వ్యాఖ్యానించింది. "బూమ్" అని దీపిక సోదరి అనీషా పదుకొణె వ్యాఖ్యానించారు.

దీపికా భర్త రణవీర్ కామెంట్ సెక్షన్‌లో చప్పట్లు కొట్టే ఎమోజీలను వేశాడు. 95వ అకాడమీ అవార్డులు మార్చి 12న లాస్ ఏంజిల్స్‌లోని డాలీ థియేటర్‌లో జరుగుతాయి. ఆస్కార్‌ వేడుకల్లో భారత్‌కు ఇది ప్రత్యేక సంవత్సరం. ఈసారి, ఒకటి కాదు, మూడు ముఖ్యమైన భారతీయ సినిమాలు ఆస్కార్ అవార్డ్స్ 2023 నామినేషన్ల కోసం పోటీ పడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్న 'నాటు నాటు' పాట ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ షార్ట్‌లిస్ట్‌లో ఉంది. షౌనక్ సేన్ యొక్క 'ఆల్ దట్ బ్రీత్స్' ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌గా, గునీత్ మోంగా యొక్క ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌గా నామినేట్ అయ్యాయి.

Next Story