అల్లు అర్జున్, అట్లీ కాంబోలో సినిమాకు హీరోయిన్ ఫిక్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.
By Knakam Karthik
అల్లు అర్జున్, అట్లీ కాంబోలో సినిమాకు హీరోయిన్ ఫిక్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘AA22’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అయితే హాలీవుడ్ రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ రానుందని మూవీ యూనిట్ నిన్న అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అందుకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా అల్లు అర్జున్‌కు జోడీగా ఏ హీరోయిన్ నటించబోతుందో తెలియజేశారు మూవీ టీమ్. ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఈ సినిమాలో కనిపించనున్నారని తెలియజేస్తూ ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా ఆ వీడియోలో.. అట్లీ దీపికా పదుకొణెకు సీన్స్ ఎక్స్‌ప్లేన్ చేస్తున్నాడు. ఇక స్టోరీ నచ్చి దీపిక చాలా బాగుంది అని చెప్పి అట్లీకి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇక అక్కడి నుంచి ఈ ముద్దుగుమ్మ కత్తి పట్టుకుని ఫైటింగ్ చేస్తున్నట్లు ప్రాక్టీస్ చేస్తుంది. సీరియస్ లుక్‌లో దీపికా భలే అనిపించింది. కత్తి పట్టుకుని గుర్రం మీద స్వారీ చేస్తూ మహారాణి ఝాన్సీ లక్ష్మీ బాయిలా దూసుకొస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సినిమాను మరో లెవెల్‌కి తీసుకుని వెళ్లే విధంగా ఉంది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
The Queen marches to conquer!❤🔥Welcome onboard @deepikapadukone✨#TheFacesOfAA22xA6 ▶️ https://t.co/LefIldi0M5#AA22xA6 - A Magnum Opus from Sun Pictures💥@alluarjun @Atlee_dir#SunPictures #AA22 #A6 pic.twitter.com/85l7K31J8z
— Sun Pictures (@sunpictures) June 7, 2025