Debutant Malayalam film director arrested in rape case. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై మలయాళ చిత్ర దర్శకుడు లిజు కృష్ణను అరెస్ట్ చేశారు. మలయాళంలో
ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై మలయాళ చిత్ర దర్శకుడు లిజు కృష్ణను అరెస్ట్ చేశారు. మలయాళంలో తెరకెక్కుతున్న 'పడవెట్టు' సినిమా షూటింగ్ లొకేషన్‌లో కృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం కన్నూర్ జిల్లాలో అరెస్టు చేయగా.. కొచ్చికి తీసుకొచ్చి ఈరోజు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు కొచ్చి నగర పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 2020 డిసెంబర్ నుండి 2021 జూన్ వరకు కొచ్చిలోని కాకనాడ్‌కు చెందిన ఒక మహిళపై ఆమెను వివిధ ప్రదేశాలలో అత్యాచారం చేసినందుకు అతన్ని అరెస్టు చేశారు. మహిళ ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చిత్ర దర్శకుడిని అరెస్టు చేశారు. కృష్ణ స్వస్థలం కన్నూర్ జిల్లా మట్టన్నూరు. అతని మొదటి చిత్రం 'పడవెట్టు' ను మలయాళ నటుడు సన్నీ వేన్ నిర్మించారు. అరెస్టు అనంతరం షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఒక పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ, "లిజు కృష్ణను ఐపీసీ సెక్షన్ 376 కింద అరెస్టు చేశారు. కేసు గురించి మరింత సమాచారం ఇవ్వలేము, కానీ ఫిర్యాదుదారు సినీ పరిశ్రమకు చెందినవారు కాదు. ఆమె అతనికి బాగా తెలిసిన వ్యక్తి" . సోమవారం కొచ్చిలోని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.