సిల్క్ స్మిత సాక్షిగా.. 'దసరా' రిలీజ్ డేట్ ఫిక్స్‌

Dasara Movie Release date Locked.నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రం ద‌స‌రా.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Aug 2022 8:19 AM GMT
సిల్క్ స్మిత సాక్షిగా.. దసరా రిలీజ్ డేట్ ఫిక్స్‌

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రం 'ద‌స‌రా'. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. శ్రీలక్ష్మి వెంకటేశ్వర బ్యానర్‌లో సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గోదావ‌రి ఖ‌ని నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర విడుద‌ల తేదీని తాజాగా చిత్ర బృందం ప్ర‌క‌టించింది. వేస‌వి కానుక‌గా వ‌చ్చే ఏడాది మార్చి 30న ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు వెల్ల‌డించింది.

ఈ మేర‌కు రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ని నాని షేర్ చేస్తూ.." ఎట్లైతే గ‌ట్ల‌నే సూస్కుందామ్‌.. ఇది ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. "అని రాసుకొచ్చారు. కాగా.. కొత్త పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. సిల్క్ స్మిత బొమ్మ గీసి ఉన్న గోడ ముందు మ‌ద్యం బాటిల్ చేతిలో ప‌ట్టుకుని నాని కూర్చుకున్న‌ట్లుగా ఉంది. మాసిన గుబురు గడ్డం, శరీరమంతా మట్టితో ఫుల్‌ మాస్‌లుక్‌లో దర్శనమిచ్చాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

సాయికుమార్‌, సముద్ర ఖ‌ని లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టిస్తోంది. సంతోష్‌ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాని పాత్ర పూర్తి విభిన్నంగా ఉండ‌నుంది.

Next Story