హీరో దర్శన్ తో పాటూ నటి పవిత్ర కూడా అరెస్ట్!

స్టార్ హీరో దర్శన్ అరెస్టుతో కన్నడ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కు గురైంది.

By M.S.R  Published on  11 Jun 2024 4:50 PM IST
darshan, pavithra, arrest, renuka swamy, murder case,

హీరో దర్శన్ తో పాటూ నటి పవిత్ర కూడా అరెస్ట్!

స్టార్ హీరో దర్శన్ అరెస్టుతో కన్నడ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కు గురైంది. ప్రస్తుతం దర్శన్‌ను దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నారని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద తెలిపారు. "జూన్ 9న కామాక్షిపాలయ పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్య కేసుకు సంబంధించి, కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటులలో ఒకరిని (దర్శన్) అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుగుతూ ఉంది. బాధితుడు చిత్రదుర్గకు చెందిన వ్యక్తి. అతని వయస్సు దాదాపు 33. అతని పేరు రేణుకా స్వామి" అని కమిషనర్ దయానంద తెలిపారు.

ఇదే కేసుకు సంబంధించి నటి పవిత్ర గౌడను కూడా అదుపులోకి తీసుకున్నారు. రేణుకాస్వామి హత్యకేసులో కన్నడ నటి పవిత్ర గౌడను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసుకు సంబంధించి కన్నడ నటుడు దర్శన్ తూగుదీపాను కూడా పోలీసులు మైసూర్‌లో అదుపులోకి తీసుకున్న కొన్ని గంటల తర్వాత ఈ అరెస్ట్ జరిగింది.

రేణుకా స్వామి జూన్ 8, 2024న బెంగుళూరులోని సుమనహళ్లి బ్రిడ్జి వద్ద శవమై కనిపించారు. అతను చిత్రదుర్గలోని అపోలో ఫార్మసీ బ్రాంచ్‌లో పని చేసేవాడు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడ్‌కు రేణుక స్వామి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపేవాడు. దీంతోనే రేణుకా స్వామిని హత్య చేసి, మృతదేహాన్ని బెంగళూరులోని కామాక్షిపాళ్య వద్ద కాల్వలో పడేశారని ఆరోపణలు ఉన్నాయి. ఎనిమిది మంది నిందితులు రేణుకా స్వామిపై దాడికి తెగబడ్డారని తెలుస్తోంది.

Next Story