'దండ‌క‌డియాల్' లిరిక‌ల్‌.. అదిరిపోయింది

Dandakadiyal Lyrical out from Dhamaka movie.మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం 'ధ‌మాకా'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Dec 2022 6:29 AM GMT
దండ‌క‌డియాల్ లిరిక‌ల్‌.. అదిరిపోయింది

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం 'ధ‌మాకా'. త్రినాథ్ రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ర‌వితేజ ద్విపాత్రిభిన‌యం చేస్తున్న ఈ సినిమాలో శ్రీలీల క‌థానాయిక‌. డిసెంబ‌ర్ 23న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర‌బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్లు, విడులైన పాట‌లు సినిమాపై అంచ‌నాల‌ను పెంచేయ‌గా తాజాగా మ‌రో పాట‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది.

'దండకడియాల్ మ‌స్తీ రుమాల్ మ‌స్తుగా ఉన్నావు గ‌ట్టిగా ఉన్నావు పిల్లా' అంటూ ఈ పాట సాగుతోంది. ర‌వితేజ‌, శ్రీలీల వేసిన స్టెప్టులు ఆక‌ట్టుకుంటున్నాయి. కొద్దిసేప‌టి కిత్ర‌మే విడుద‌లైన ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. భీమ్స్ సిసిరోలియో స్వర పరిచిన ఈ పాటను భీమ్స్‌తో పాటు సాహితి, మంగ్లీ పాడారు. పీపుల్‌ మీడియా, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.

Next Story