ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శివ‌శంక‌ర్ మాస్టర్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం

Dance Choreographer Sivasanker Master health condition is critical.ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శివ‌శంక‌ర్ మాస్టర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Nov 2021 2:27 AM GMT
ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శివ‌శంక‌ర్ మాస్టర్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం

ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శివ‌శంక‌ర్ మాస్టర్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంది. కొద్ది రోజుల క్రితం శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఆయ‌న‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకింది. ఆయ‌న భార్య హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటుండ‌గా.. పెద్ద కుమారుడు ప్ర‌స్తుతం అప‌స్మార‌స్థితిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న శివ శంక‌ర్ మాస్ట‌ర్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు. ఆయ‌న ఊపిరితిత్తుల‌కు 75 శాతం ఇన్‌ఫెక్ష‌న్ సోకిన‌ట్లు వెల్ల‌డించారు. చిన్న కుమారుడు అజయ్‌ కృష్ణ ఒక్కడే తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు.

కాగా.. శివశంకర్ మాస్టర్ చికిత్స‌కు ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చ‌వుతున్నాయ‌ని.. ప్ర‌స్తుతం త‌మ కుటుంబానికి అంత చెల్లించే స్థోమ‌త లేద‌ని.. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయవలసిందిగా ఆయన కుమారుడు అజయ్ కృష్ణ కోరుతున్నారు.

శివ శంకర్‌ మాస్టర్‌ తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా దాదాపు 10 బాష‌ల్లో కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 800 చిత్రాల‌కు పైగా డ్యాన్స్ మాస్ట‌ర్‌గా ప‌నిచేశారు. దర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన 'మ‌గధీర' చిత్రంలో 'ధీర.. ధీర‌..' పాట‌కు గానూ 2011లో శివ‌శంక‌ర్ మాస్ట‌ర్‌కు జాతీయ పుర‌స్కారం ల‌భించింది. డ్యాన్స్ మాస్ట‌ర్‌గానే కాకుండా ప‌లు చిత్రాల్లో న‌టుడిగానూ క‌నిపించారు. బుల్లితెర‌పై ప‌లు డ్యాన్స్ షోల‌కు జ‌డ్జీగానూ వ్య‌వ‌హ‌రించారు.

Next Story
Share it