పుష్ప.. 'దాక్కో దాక్కో మేక'.. దుమ్మురేపిన ఐకాన్ స్టార్‌

Dakko Dakko Meka full song released.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Aug 2021 11:24 AM IST
పుష్ప.. దాక్కో దాక్కో మేక.. దుమ్మురేపిన ఐకాన్ స్టార్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం పుష్ప‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూడో చిత్రం కావ‌డంతో అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈచిత్రంలో బ‌న్ని స‌ర‌స‌న ర‌ష్మిక మందాన న‌టిస్తోంది. పాన్ ఇండ‌యా లెవ‌ల్లో తెర‌కెక్కుతున్న ఈచిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో బన్నీ ఊర మాస్ లుక్‏లో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించబోతుండడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రం రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది. దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా.. ఈచిత్రంలోని దాక్కో దాక్కో మేక పాట‌ని శుక్ర‌వారం చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. ఆకలి ఆకలి అంటూ సాగుతున్న పాటలో లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. బన్నీ మాస్ లుక్‏లో తనదైన మాస్ స్టెప్పులతో, ఎక్స్‏ప్రెషన్స్‏తో అదరగొట్టాడు. ఐదు భాష‌ల్లో ఈ పాట విడుద‌లైంది. తెలుగులో శివం, హిందీలో విశాల్ ద‌డ్లాని, క‌న్న‌డంలో విజ‌య ప్ర‌కాష్, త‌మిళంలో బెన్నీ ద‌యాల్‌, మ‌ల‌యాళంలో రాహుల్ నంబియార్ ఈ పాటని పాడారు. ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా.. పుష్ప తొలి పార్టును ఈ ఏడాది క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌ల కానుంది. ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా ఓసారి ఈ పాట‌ను వినేయండి.

Next Story