దగ్గుబాటి కుటుంబంలో మరో విషాదం నెలకొంది. హీరో విక్టరీ వెంకటేష్ చిన్నాన్న, దివంగత రామానాయుడు సోదరుడు రామమోహనరావు అలియాస్ మోహన్ బాబు కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ప్రకాశం జిల్లా కారంచేడులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 77 సంవత్సరాలు
విషయం తెలుసుకున్న వెంటనే నిర్మాత సురేశ్‌బాబు తన కుటుంబంతో కలిసి కారంచేడు చేరుకుని మోహన్‌బాబు భౌతికకాయానికి నివాళులర్పించారు. రానా, వెంకటేష్‌లు బుధవారం కారంచేడుకు చేరుకుంటారని, మోహన్‌బాబు అంత్యక్రియల్లో పాల్గొంటారని తెలుస్తోంది.
మోహన్‌బాబు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. దగ్గుబాటి రామానాయుడు హైదరాబాద్ సహా చెన్నైలో వ్యాపారాలతో బిజీగా ఉన్న సమయంలో మోహన్ బాబు కారంచేడులోని దగ్గుబాటి కుటుంబానికి చెందిన వ్వవసాయం ఇతర బాధ్యతల్ని నిర్వర్తించారు.