'ఆర్ఆర్ఆర్' కు మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు

Dadasaheb Phalke Awards 2023 'RRR' win big at International Film Festival.మ‌న దేశ సినీ ప‌రిశ్ర‌మ‌లోఇచ్చే ప్ర‌తిష్టాత్మ‌క

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Feb 2023 5:28 AM GMT
ఆర్ఆర్ఆర్ కు మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు

ద‌ర్శ‌కదీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం)'. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లు న‌టించిన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ప్ర‌తీ చోట ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు అవార్డుల‌ను ఈ చిత్రం ద‌క్కించుకుంది. "నాటు నాటు" పాటకు "గోల్డెన్ గ్లోబ్" అవార్డు అందుకుని చ‌రిత్ర సృష్టించింది. అంతేనా.. బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరిలో ఈ పాట ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో నిలిచింది.

తాజాగా మ‌న దేశ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇచ్చే ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకుంది. ముంబైలో సోమ‌వారం రాత్రి దాదా సాహెబ్ ఫాల్కే ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 2023 అవార్డ్స్ కార్య‌క్ర‌మం అట్ట‌హాసంగా జ‌రిగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం ఫిల్మ్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డును ద‌క్కించుకుంది. దీంతో చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడా ఆనందం వ్య‌క్తం చేశారు. ఇంకా మ‌రిన్ని అవార్డులు ఆర్ఆర్ఆర్ అందుకుంటుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. క‌న్న‌డ చిత్ర‌సీమ నుంచి చిన్న సినిమాగా విడుద‌లై దేశ వ్యాప్తంగా ప్ర‌భంజ‌నం సృష్టించిన 'కాంతారా' కు అవార్డు ల‌భించింది. ఈ చిత్రంలోని న‌ట‌న‌కు గాను రిష‌బ్ శెట్టి మోస్ట్ ప్రామిసింగ్ యాక్ట‌ర్ అవార్డు వ‌రించింది.

విజేత‌లు

ఉత్త‌మ చిత్రం - ది క‌శ్మీర్ ఫైల్స్‌

ఉత్తమ దర్శకుడు – ఆర్‌. బాల్కి (చుప్‌ )

ఉత్త‌మ న‌టుడు - ర‌ణ్‌బీర్ క‌పూర్‌(బ్ర‌హ్మ‌స్త్ర -1)

ఉత్త‌మ న‌టి - ఆలియా భ‌ట్‌(గంగూబాయి కాఠియావాడి)

మోస్ట్ ప్రామిసింగ్ యాక్ట‌ర్ - రిష‌బ్ శెట్టి(కాంతారా)

క్రిటిక్స్‌ బెస్ట్‌ యాక్టర్‌ – వరుణ్‌ ధావన్‌ (బేడియా )

క్రిటిక్స్‌ ఉత్తమ నటి – విద్యాబాలన్‌ (జల్సా )

మోస్ట్‌ వర్సటైల్‌ యాక్టర్‌ – అనుపమ్‌ ఖేర్‌

బెస్ట్ ప్లే బ్యాక్‌ సింగర్‌ – సాచిత్‌ తాండన్‌

ఉత్తమ సహాయ నటుడు – మనీష్‌ పాల్‌ (జగ్‌ జగ్‌ జియో )

టెలివిజన్‌ /ఓటీటీ విభాగాల్లో

ఉత్తమ నటుడు – జైన్‌ ఇమనాన్ ( ఇష్క్‌ మే మర్‌జావా )

ఉత్తమ నటి – తేజస్వి ప్రకాశ్‌ ( నాగిన్‌ )

ఉత్తమ సహాయ నటి – షీబా చద్దా

ఉత్తమ వెబ్‌ సిరీస్‌ – రుద్ర : ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌

ఉత్తమ వెబ్‌సిరీస్‌ నటుడు - జిమ్‌ షార్బ్‌ ( రాకెట్‌ బాయ్స్‌ )

టెలివిజన్‌ సిరీస్‌ ఆఫ్‌ ది ఇయర్ - అనుపమ

Next Story