సోనుసూద్‌పై అభిమానం.. కిలిమంజారో ప‌ర్వ‌తం ఎక్కి

Cyclist unveils Sonu Sood's poster at Mt.Kilimanjaro.కరోనా సమయంలో చాలా మంది వలస కూలీలను వారివారి సొంత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Aug 2021 5:35 AM GMT
సోనుసూద్‌పై అభిమానం.. కిలిమంజారో ప‌ర్వ‌తం ఎక్కి

కరోనా సమయంలో చాలా మంది వలస కూలీలను వారివారి సొంత గ్రామాలకు చేర్చిన బాలీవుడ్ న‌టుడు సోనుసూద్ వారి పాలిట దేవుడు అయ్యాడు. సినిమాలో విలన్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో అందరి దృష్టిలో హీరో అనిపించుకుంటున్నాడు. ఉపాధి కోల్పోయిన వారికి కూడా తగిన సహాయంతో పాటు ఉపాధి కూడా కల్పించాడు. ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేశాడు. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి. కానీ ఎదుటివారికి సహాయం చేయాలనే గుణం మాత్రం కొందరికి మాత్రమే ఉంటుందని చూపించాడు. సోను దాన గుణాన్ని యావత్ భారతదేశం మెచ్చుకుంది.

సోనుసూద్ మంచి త‌నాన్ని గుర్తించిన వారు ఏదో విధంగా సోనుసూద్‌పై త‌మ‌కు ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. కొంద‌రు సోనుకి గుడి క‌ట్టి పూజ‌లు చేయ‌గా.. ప‌లువురు దుకాణాల‌కు, కొంద‌రు చిన్నారుల‌కు సోను పేరును పెట్టుకున్నారు. మ‌రికొంద‌రు పాద‌యాత్ర చేసి సోనుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇదిలా ఉంటే.. సైక్లిస్ట్‌, ప‌ర్వాతాహారోధ‌కుడు అయిన ఉమాసింగ్ అనే వ్య‌క్తి సోను పై ఉన్న అభిమాని సాహ‌సోపేతంగా తెలియ‌జేయాడు.

ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో ప‌ర్వ‌కం పైకి చేరుకుని సోనుసూద్‌, త్రివ‌ర్ణ ప‌తాకం ఉన్న ఫోటోను ప్ర‌ద‌ర్శించాడు. భార‌తదేశ‌పు నిజ‌మైన హీరో సోనుసూద్ అని అభివ‌ర్ణించాడు. వీటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిని చూసిన సోనుసూద్ వావ్‌.. నేను కిలిమంజారో ప‌ర్వ‌తం అధిరోహించాన‌నుకుంటున్నా.. చాలా గ‌ర్వంగా ఉంది ఉమ అని ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Next Story