ఆర్ఆర్ఆర్ పోస్టర్‌పై ట్రాఫిక్ పోలీసుల సెటైర్‌.. రివ‌ర్స్ పంచ్ ఇచ్చిన చిత్ర‌బృందం

Cyberabad police made RRR Movie poster goes viral.యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jun 2021 1:15 PM GMT
ఆర్ఆర్ఆర్ పోస్టర్‌పై ట్రాఫిక్ పోలీసుల సెటైర్‌.. రివ‌ర్స్ పంచ్ ఇచ్చిన చిత్ర‌బృందం

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లు క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్‌(రౌద్రం, రణం, రుధిరం)'. ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంద‌ని రెండు పాట‌లు మిన‌హా అంతా పూర్తి అయింద‌ని చిత్ర‌బృందం ఈ రోజు ఉద‌యం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. అంతేకాకుండా ఎన్టీఆర్ బైక్ న‌డుపుతుండ‌గా.. చ‌ర‌ణ్ వెనుకాల కూర్చున్న ఫోటోను అభిమానుల‌తో పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ పోస్ట‌ర్‌ను వాడుకుని ట్రాఫిక్ నిబంధ‌న‌లు పాటించాలంటూ త‌మ‌దైన శైలిలో క్రియేటివ్ గా చెప్పుకొచ్చారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. బైక్‌పై వెళ్తున్న ఎన్టీఆర్‌, చెర్రీకి హెల్మెట్లు పెట్టడంతో పాటు బండికి సైడ్ మిర్రర్స్ కూడా పెట్టారు. ఇప్పుడు ఫర్‌ఫెక్ట్‌గా ఉందంటూ ట్వీట్‌ చేసింది. 'హెల్మెట్ ధరించండి.. సురక్షితంగా ఉండండి' అంటూ తమ ట్రేడ్ మార్క్ నినాదాన్ని క్యాప్షన్‌గా ఇచ్చింది. ప్రస్తుతం ట్రాఫిక్‌ పోలీసుల ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇక నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్వీట్‌పై ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ కూడా ఫన్నీగా స్పందించింది. 'ఇప్ప‌టికి ఇది పర్ఫెక్ట్ కాదు.. నెంబర్ ప్లేట్ మిస్సింగ్' అంటూ ఫ‌న్నీగా రిప్లై ఇచ్చింది.

Next Story
Share it