'మా' ఎన్నికలు.. కీలక పరిణామం.. పోటి నుంచి తప్పుకున్న సీవీఎల్
CVL Narasimha Rao withdraw his nomination.గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు
By తోట వంశీ కుమార్ Published on 2 Oct 2021 2:11 PM ISTగతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. 'మా' అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటుడు సీవీఎల్ నరసింహారావు ఈ ఉదయం మేనిఫెస్టో ప్రకటించి.. కాసేటికే తాను పోటి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్లు ఆయన వెల్లడించారు. తాను తప్పుకోవడం వెనుక ఉన్న కారణాన్ని మరో రెండు రోజుల్లో మీడియా సమావేశంలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు. పదవి కంటే 'మా' సభ్యుల సంక్షేమమే తనకు ముఖ్యమన్నారు. ఇక పోటీలో ఉన్న రెండు ప్యానళ్లలో ఎవ్వరికి మద్దతు ఇవ్వడం లేదన్నారు. తాను ప్రకటించిన మేనిఫెస్టో అమలు అయ్యే విధంగా చూస్తానన్నారు.
నామినేషన్ ఉపసంహరించుకునే ముందు సీవీఎల్ ప్రకటించిన మేనిఫెస్టో
- 2011 లో మనం పాస్ చేసుకున్న రిజల్యూషన్ పర్ఫెక్ట్ గా అమలు చేయడం. దాని వలన ఆర్టిస్టుల అందరికీ అవకాశాలు వస్తాయన్నారు.
- ప్రతి మా సభ్యుడికి 3 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్. అది వచ్చే జనవరి నుంచి అమలు.
- ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో మా మెంబర్ కి అసోసియేట్ మెంబర్ షిప్ .
- పెన్షన్ ప్రస్తుతం రూ.6వేలు ఇస్తున్నారు. ఈ నవంబర్ నుంచి అది రూ.10వేలు ఇచ్చేలా చెయ్యడం.
- ఆడవాళ్ళకు ఉపయోగ పడే ఆసరానీ 20 ఏళ్లు క్రితం పెట్టాము. మళ్ళీ రివైవ్ చేయడం. ఆసరా కమిటీలో ఉండే 13 మంది పేర్లను త్వరలోనే ఎనౌన్స్ చేస్తాను.
- ఎవరైనా మా సభ్యుడు ఆకలి భాధలు పడుతుంటే అతను కాల్ చేసినా 2 గంటలలో అతని ఇంటికి నెల రోజులకు సరిపడా గ్రాసరినీ పంపిస్తాం.