ఆక‌ట్టుకుంటున్న 'క్రేజీ ఫెలో' టీజ‌ర్‌

Crazy Fellow Teaser Out.టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ న‌టిస్తున్న చిత్రం క్రేజీ ఫెలో.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 1 Sept 2022 2:45 PM IST

ఆక‌ట్టుకుంటున్న క్రేజీ ఫెలో టీజ‌ర్‌

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ న‌టిస్తున్న చిత్రం 'క్రేజీ ఫెలో'. ఫ‌ణి కృష్ణ సిరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

సాయికుమార్ వాయిస్ ఓవ‌ర్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మైంది. "ఒక పంచ్ లైన్‌లో మ‌నోడి గురించి చెప్పాలంటే.. మందు తాగితే లివ‌ర్ పోద్ది.. సిగ‌రెట్ తాగితే లంగ్స్ పోతాయి.. వీడితో ఉంటే దూల తీరిపోతుందనే" అనే డైలాగ్‌తో ప్రారంభ‌మైన టీజ‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. "పులితో పరుగుపందెం.. నాతో మందు పందెం వేయకూడదు" అంటూ ఆది చెప్పే డైలాగ్ అల‌రిస్తోంది.

ఆర్ఆర్ ధృవన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. స‌ప్త‌గిరి, న‌ర్రా శ్రీనివాస్‌, అనీష్ కురువిల్ల‌, వినోధిని వైద్య‌నాథ‌న్‌, కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈచిత్రం అక్టోబ‌ర్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. పోషిస్తున్నారు.

Next Story