కేరళలో 'రజనీ' క్రేజ్ చూస్తే.. దిమ్మతిరిగిపోద్ది..!

రజనీకాంత్- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన కూలీ చిత్రం థియేటర్లలో విడుదల కావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, టిక్కెట్ల అమ్మకాల విషయంలో భారీగా హైప్ వచ్చింది.

By Medi Samrat
Published on : 8 Aug 2025 8:41 PM IST

కేరళలో రజనీ క్రేజ్ చూస్తే.. దిమ్మతిరిగిపోద్ది..!

రజనీకాంత్- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన కూలీ చిత్రం థియేటర్లలో విడుదల కావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, టిక్కెట్ల అమ్మకాల విషయంలో భారీగా హైప్ వచ్చింది. కేరళ బుకింగ్‌లలో కూలీ కేవలం 4 గంటల్లోనే జైలర్, వెట్టయ్యన్‌ సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది. కూలీ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సినిమా అందరి అంచనాలకు మించి ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటికే చాలా షోలు హౌస్ ఫుల్ అయ్యాయి.

పరిమిత షోలకు బుకింగ్‌లు తెరిచినప్పటికీ, ఈ చిత్రం టికెటింగ్ యాప్ బుక్ మై షోలో గంటకు 50K+ గరిష్ట బుకింగ్‌లను చేరుకుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్ని ప్రాంతాలలో పూర్తి స్థాయి బుకింగ్‌లు ప్రారంభమైతే బుక్ మై షోలో కొత్త రికార్డులను సృష్టిస్తుందని దీని అర్థం. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కూలీ చిత్రం కేరళ బుకింగ్‌లలో జైలర్, వెట్టయ్యన్‌లను కేవలం 4 గంటల్లోనే వెనక్కు నెట్టింది. ఈ చిత్రం బుకింగ్‌లు జరిగిన మొదటి 4 గంటల్లోనే ₹2.5 కోట్ల+ ప్రీ-సేల్స్‌ను నమోదు చేసింది. సూపర్‌స్టార్ మునుపటి సినిమాలైన జైలర్ (₹2.1 కోట్లు), వెట్టయ్యన్ (₹1.7 కోట్లు) తుది ప్రీ-బుకింగ్ అమ్మకాలను ఇప్పటికే అధిగమించింది.

Next Story