నయన్ 'కనెక్ట్' ట్రైలర్..
Connect Movie trailer released.నయనతార నటించిన చిత్రం 'కనెక్ట్'.
By తోట వంశీ కుమార్ Published on 9 Dec 2022 11:06 AM ISTలేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన చిత్రం 'కనెక్ట్'. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయన్ భర్త విగ్నేష్ శివన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించారు. తమిళ్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ తెలుగు లో విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 22న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రభాస్ విడుదల చేశారు.
అర్థరాత్రి 12 గంటలకు ఓ ట్రైలర్‌ని విడుదల చేయడం భారతీయ సినీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. కరోనా లాక్‌డౌన్ సమయంలో అందరూ ఇళ్లలోనే ఉండిపోయారు. ఈ సమయంలో నయనతార కూతురికి దెయ్యం పడుతుంది. ఆ అమ్మాయి ఒంట్లోకి ప్రవేశించిన ఆత్మను బయటకు పంపించేందుకు ఇంట్లో వాళ్లు ఏం చేశారు..? అనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
ఇక ఈ సినిమా రన్ టైన్ కూడా 99 నిమిషాలు మాత్రమే. ఇంటర్వెల్ లేదు. త్వరాజ్, అనుపమ్ ఖేర్, వినయ్ రాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పృథ్వీ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.