నిహారిక భ‌ర్త‌పై పోలీసుల‌కు ఫిర్యాదు

Complaint lodged against Niharika husband.గతేడాది డిసెంబర్ నెలలో రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్ ప్యాలెస్‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Aug 2021 5:27 AM GMT
నిహారిక భ‌ర్త‌పై పోలీసుల‌కు ఫిర్యాదు

గతేడాది డిసెంబర్ నెలలో రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్ ప్యాలెస్‌లో మెగా డాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డకు ఘనంగా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇక నిహారిక పెళ్లి త‌రువాత కూడా యాక్టింగ్ కంటిన్యూ చేస్తోంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిహారిక.. త‌న భ‌ర్త‌తో క‌లిసి దిగిన ఫోటోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది. మార్చి నెల‌లో హైద‌రాబాద్‌లోని ఫిల్మ్‌న‌గ‌ర్ నుంచి షేక్‌పేట్ వెళ్లే దారిలో ఉండే ఓ అపార్ట్‌మెంట్‌లో నిహారిక దంప‌తులు నివ‌సిస్తున్నారు. త‌మ వృతిప‌ర‌మైన జీవితానికి సంబంధించిన ప‌నుల కోసం ఈ ఫ్లాట్ ఉప‌యోగించుకునేవారు.

ఇదిలా ఉంటే.. తాజాగా నిహారిక భర్త చైతన్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంగిస్తూ.. గుంపులు గుంపులుగా ఫ్లాట్‌లోకి వ‌స్తున్నార‌ని.. దాని వ‌ల్ల తాము ఇబ్బందుల‌కు ప‌డుతున్నామ‌ని అపార్ట్‌మెంట్ వాసులు బుధ‌వారం అర్థ‌రాత్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మ‌రోవైపు.. త‌మ వ్య‌క్తి గ‌త జీవితానికి అపార్ట్‌మెంట్ వాసుల వ‌ల్ల ఇబ్బందులు క‌లుగుతున్నాయ‌ని చైత‌న్య పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ప‌ర‌స్ప‌ర ఫిర్యాదులు స్వీక‌రించిన పోలీసులు.. విచార‌ణ చేప‌ట్టారు.

Next Story
Share it