హీరో తలపతి విజయ్‌పై నార్కొటిస్ కంట్రోల్ యాక్ట్ సెక్షన్ కింద ఫిర్యాదు

తమిళ హీరో విజయ్‌ దళపతి నటిస్తున్న తాజా సినిమా 'లియో'. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో

By అంజి  Published on  26 Jun 2023 12:29 PM IST
actor Vijay, Leo, Kollywood, Narcotics Control Act

హీరో తలపతి విజయ్‌పై నార్కొటిస్ కంట్రోల్ యాక్ట్ సెక్షన్ కింద ఫిర్యాదు

తమిళ హీరో విజయ్‌ దళపతి నటిస్తున్న తాజా సినిమా 'లియో'. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో 'లియో' విడుదల కానుంది. జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా 'లియో'లోని 'నా రెడీ' అనే మొదటి సింగిల్‌ని విడుదల చేశారు. ఈ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచినప్పటికీ, ఇది చిత్రయూనిట్‌ని ఇబ్బందుల్లోకి నెట్టింది. 'నా రెడీ' పాటలో డ్రగ్స్ వినియోగం, రౌడీయిజాన్ని కీర్తించడం చేశారంటూ ఆర్టీఐ సెల్వం అనే కార్యకర్త మూవీ టీమ్‌పై ఫిర్యాదు చేశారు.

విజయ్ 49వ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ లియో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్‌ చేసింది. ఇటీవల విడుదలైన 'నా రెడీ' పాట విషయంలో తలపతి విజయ్, 'లియో' నిర్మాతలు ఇబ్బందుల్లో పడ్డారు. 'నా రెడీ' సాంగ్‌లో డ్రగ్స్ వాడకం, రౌడీయిజాన్ని కీర్తించినందుకు విజయ్, లియో టీమ్‌పై చెన్నైలోని కొరుక్కుప్పేట్టైకి చెందిన ఆర్‌టిఐ సెల్వం అనే కార్యకర్త ఫిర్యాదు చేశారు.

జూన్ 25న ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసి, జూన్ 26న ఉదయం 10 గంటలకు తన పిటిషన్‌ను సమర్పించాడు. వారిపై నార్కోటిక్ నియంత్రణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా చెన్నై పోలీసులు నగరంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో నటులు కార్తీ, విజయ్ ఆంటోని పాల్గొన్నారు.

లియో గురించి..

లియో ఒక యాక్షన్ థ్రిల్లర్, దీనికి లోకేష్ కనగరాజ్ రచన,దర్శకత్వం వహించారు . ఈ చిత్రంలో తలపతి విజయ్, సంజయ్ దత్, త్రిష ప్రధాన పాత్రలు పోషించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఆయుధ పూజా వారాంతంలో అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్, యాక్షన్ కింగ్ అర్జున్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్ సహాయక తారాగణం. లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

Next Story