ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నాం తీవ్రమైన గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వివేక్ చేరిన సంగతి తెలిసిందే. డాక్టర్లు ఆయనకు యాంజియోప్లాస్టీ చేసి స్టంట్ వేశారు. ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి ఆయనకు మెరుగైన చికిత్స అందింస్తుండగా.. శనివారం తెల్లవారు జామున 4.35 గంటలకు కన్నుమూసినట్లు హాస్పిటల్ హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. వివేక్ ఆకస్మిక మృతితో తమిళ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
తమిళ చిత్ర సీమలో మంచి ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న వివేక్.. దాదాపు 300 లకు పైగా చిత్రాల్లో నటించాడు. స్టార్ హీరోలు రజనీకాంత్, సూర్య, అజిత్, రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ చిత్రాల్లో హాస్యనటుడిగా నటించి మెప్పించారు. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో విడుదలవగా.. ఇక్కడ కూడా ఎంతో మంచి పేరు వచ్చింది. కొన్నాళ్ల క్రితం వివేక్ తల్లి, కొడుకు ప్రసన్న కుమార్ మరణించడంతో ఆయన బాగా కుంగిపోయారు. త తర్వాత సినిమాలకు ఎక్కువగా చేయడం లేదు. గత గురువారం వివేక్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని.. ప్రజలకు కరోనా జాగ్రత్తలపై అవగాహన పెంచే ప్రయత్నం చేశారు.