గాయాల‌తో ఆస్ప‌త్రిలో కమెడియన్ వైవా హ‌ర్ష‌.. ‌ఏమైందంటే..?

Comedian Viva Harsha injured and hospitalized.వైవా హ‌ర్ష సినిమా షూటింగ్ కోసం ఇలా గాయాలైనట్టుగా నటిస్తున్నట్టు తెలిసేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Feb 2021 11:03 AM IST
Comedian Viva Harsha injured and hospitalized

'వైవా' షార్ట్ ఫిల్మ్‌తో యూట్యూబ్ నుంచి వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యాడు హ‌ర్ష‌. ఆ షార్ట్ ఫిలిం లో హర్ష ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కు అందరూ ఫిదా అయిపోయారు. హోస్ట్‌గాను, న‌టుడిగాను అద‌ర‌గొడుతున్నాడు. సినిమాలు, షార్ట్ ఫిలింస్‌, వెబ్ సిరీస్ ఇలా ఒక‌టేంటి దొరికిన ఛాన్స్‌ల‌న్నింటిని మంచిగా ఉప‌యోగించుకుంటూ దూసుకుపోతున్నాడు.

హర్ష కొద్ది రోజుల క్రితం అక్ష‌ర అనే యువ‌తితో నిశ్చితార్ధం జ‌రుపుకున్నాడు. ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ఫుల్ వైర‌ల్ అయ్యాయి. ఏడాదిలో గుడ్ న్యూస్ చెప్ప‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. మ‌రి కొద్ది రోజుల‌లో పెళ్ళి శుభవార్త చెప్తాడ‌ని అంద‌రు ఎదురు చూస్తున్న క్ర‌మంలో వైవా హ‌ర్ష త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు ప్ర‌తి ఒక్క‌రికి షాక్ ఇచ్చాయి. బైక్ రైడింగ్‌లకు సంబంధించిన ఫోటోలు, గాయాల‌తో ఆసుప‌త్రి పాలైన ఫొటోలను వైవా హ‌ర్ష షేర్ చేయ‌గా, ఇవి తెగ వైర‌ల్ అయ్యాయి. హ‌ర్ష‌ని అలా చూసే స‌రికి అత‌డి అభిమానులు కంగారు ప‌డ్డారు.


హర్ష ఇప్పుడు సుమంత్ హీరోగావస్తోన్న 'అనగనగా ఓ రౌడీ' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆ మూవీ షూటింగ్ కోసం ఇలా మేకప్ వేసుకుని రెడీ అయి అలా హాస్పిటల్‌లో ఉన్నాడు. ఫోటో చూసి కంగారు పడిన నెటిజన్లు ఆయన పెట్టిన క్యాప్షన్ చూసి కూల్ అయ్యారు. సినిమా షూటింగ్ కోసం ఇలా గాయాలైనట్టుగా నటిస్తున్నట్టు తెలిసేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.




Next Story