ప్రముఖ కమెడియన్ కన్నుమూత
Comedian Shankar Rao passed away at 88.సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి మరణవార్తను
By తోట వంశీ కుమార్ Published on
19 Oct 2021 3:24 AM GMT

సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి మరణవార్తను జీర్ణించుకోలేక ముందే మరొకరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కన్నడ హాస్యనటుడు శంకర్ రావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సంతాపం తెలిపారు.
శంకర్ రావు మూడు దశాబ్దాలకు పైగా అభిమానులను అలరించారు. విష్ణువర్ధన్, శంకర్ నాగ్, అనంత్ నాగ్, లోకేష్, శ్రీనాథ్, ద్వారకీష్, శివరాజ్ కుమార్, రవిచంద్రన్, రమేష్ అరవింద్, ఉపేంద్ర, పునీత్ రాజ్ కుమార్ మరియు దర్శన్ వంటి స్టార్ హీరోలందరి సినిమాల్లోనూ నటించారు. దాదాపు వందకు పైగా కన్నడ చిత్రాల్లో ఆయన నటించారు. రంగభూమి కళాకారునిగా కూడా మంచి పేరు సంపాదిందిచారు. 'యారా సాక్షి' చిత్రంతో తో తెరగ్రేటం చేశారు. పలు సీరియల్స్‌లోనూ ఆయన నటించారు. 'మాయ మృగ', 'సిల్లీ లల్లీ' మరియు 'పాపా పాండు' వంటి ప్రముఖ కన్నడ టీవీ సీరియల్స్‌లో నటించి ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు.
Next Story