మంచి పని చేశావ్ సప్తగిరి అంటూ.. నెటిజన్స్ అభినందనలు

Comedian Saptagiri helps writer Nandyala ravi.నంద్యాల ర‌వికి సినీ హాస్య న‌టుడు స‌ప్త‌గిరి త‌న వంతుగా రూ.ల‌క్ష సాయం అందించి మంచి మ‌న‌సును చాటుకున్నాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2021 1:31 PM GMT
Comedian Saptagiri

కరోనా కష్ట కాలాల్లో ఎంతో మంది ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్న సంగతి తెలిసిందే..! దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్న కరోనా కేసులతో అధికారులు సతమతమవుతూ ఉన్నారు.. ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఇక చాలా మందికి వైద్యం చేయించుకోడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. ఎంతో మంది జీవితాలు తలక్రిందులు అవుతూ ఉన్నాయి. కొందరు ప్రముఖులు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోడానికి తమ వంతుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తాజాగా టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి కూడా ఓ మంచి పని చేసి ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు.

సినీ ద‌ర్శ‌కుడు, ర‌చయిత నంద్యాల ర‌వికి క‌రోనా సోకడంతో ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయ‌న ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌నకు క‌రోనా సోకి, పరిస్థితి విష‌మంగా ఉండడంతో ఆయ‌న‌ కుటుంబ స‌భ్యులకు ఏమి చేయాలో.. ఎవరిని సాయం అడగాలో తెలియని పరిస్థితి. ఈ ప‌రిస్థితుల్లో నంద్యాల ర‌వికి సినీ హాస్య న‌టుడు స‌ప్త‌గిరి త‌న వంతుగా రూ.ల‌క్ష సాయం అందించి మంచి మ‌న‌సును చాటుకున్నాడు. నంద్యాల ర‌వికి కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ) నుంచి కూడా కొంత సాయం అందిన‌ట్లు తెలిసింది. ప్రస్తుతం నంద్యాల ర‌వి ద‌ర్శ‌క‌త్వంలో స‌ప్త‌గిరి ఓ సినిమా చేస్తున్నాడు. ఆసుపత్రి బిల్లు 7 లక్షల వరకు అయ్యిందని తెలుస్తుంది. దర్శకుడి కుటుంబానికి అంత పెద్ద మొత్తాన్ని భరించే శక్తి లేకపోవడంతో నటుడు సప్తగిరి పెద్ద మనసుతో ముందుకు వచ్చి లక్షరూపాయలు ఆర్ధిక సాయం అందించాడని సమాచారం. మంచి పని చేసిన సప్తగిరిని అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు.


Next Story