అనసూయ చేస్తున్న విమర్శలకు.. కమెడియన్ రాహుల్ రామకృష్ణకు ఓ డౌట్ వచ్చింది

ఏమైందో ఏమో తెలీదు కానీ.. సోషల్ మీడియాలో ఓ యంగ్ హీరో గురించి టాలీవుడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కౌంటర్లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 May 2023 12:15 PM IST
Comedian Rahul Ramakrishna, anchor Anasuya, Vijayadevarakonda Fans

అనసూయ చేస్తున్న విమర్శలకు.. కమెడియన్ రాహుల్ రామకృష్ణకు ఓ డౌట్ వచ్చింది

ఏమైందో ఏమో తెలీదు కానీ.. సోషల్ మీడియాలో ఓ యంగ్ హీరో గురించి టాలీవుడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కౌంటర్లు వేస్తూనే ఉంటారు. ఆ యంగ్ హీరో స్టార్ హీరో అవ్వకముందు ఓ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడిన మాటలు యాంకర్ అనసూయకు నచ్చలేదని అంటూ ఉంటారు. ఆ విషయం అప్పట్లో రచ్చ జరిగింది. ఆ యంగ్ హీరో కాస్తా స్టార్ హీరో అయ్యాడు. ఒక పాన్ ఇండియా సినిమా కూడా తీశాడు. ఆ సినిమా విడుదలైన మొదటి రోజే.. మరో వివాదాస్పదమైన కామెంట్ చేశారు అనసూయ. అప్పుడు ఆ హీరో ఫ్యాన్స్ బాగా విమర్శలు గుప్పించారు. "చిత్ర పరిశ్రమలో ఉండి ఒక సినిమా ఫ్లాప్ అయితే ఇంత ఆనందపడాలా.. ఒక సినిమా వెనుక ఎంత మంది కష్టం ఉంటుందో మీకు తెలీదా.. ఆ హీరో మీద ఉన్న కక్షతో సినిమాను చంపేయాలని అనుకుంటారా" అంటూ బాగా కౌంటర్లు వేశారు అభిమానులు. ఇక ఈ మధ్య 'ఆ హీరో' మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. తన పేరు మీద THE అనే పదాన్ని ఉంచారు. ఈసారి కూడా అనసూయకు అది కూడా ఎందుకో నచ్చలేదు 'THE నా....' అంటూ మరో కామెంట్ చేశారు. దీంతో మళ్లీ ఆ హీరో అభిమానులు అనసూయపై విరుచుపడుతూ ఉన్నారు.

”నువ్వు నన్ను తిడితే.. నీ కంపు నోరు తప్పు అవుతుంది కానీ, నేనెలా తప్పు అవుతాను.. నా పెంపకం గర్వించదగినది. నా అభిప్రాయాన్ని ధైర్యంగా , గౌరవపూర్వకంగా చెప్పడం నేర్పింది. మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్ధం చేసుకోండి” అని తాజాగా మరో పోస్టు పెట్టారు అనసూయ. కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఈ వివాదంలోకి ఎంటర్ అయ్యాడు.. ”దయచేసి ఈ విధంగా అడుగుతున్నందుకు క్షమించు. అసలు ఈ లొల్లి ఏంటో చెప్తారా..?” అంటూ ప్రశ్నించాడు. దానికి అనసూయ అయితే సమాధానం ఇవ్వలేదు కానీ, విజయ్ ఫ్యాన్స్ మాత్రం రకరకాలుగా చెబుతున్నారు.

Next Story