'కోబ్రా' ఓటీటీ డేట్ ఫిక్స్‌.. చిన్న ట్విస్ట్‌

Cobra Movie OTT Release date Fix.చియాన్ విక్ర‌మ్ న‌టించిన చిత్రం 'కోబ్రా'. ఈ చిత్ర డిజిట‌ల్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Sept 2022 10:05 AM IST
కోబ్రా ఓటీటీ డేట్ ఫిక్స్‌.. చిన్న ట్విస్ట్‌

చియాన్ విక్ర‌మ్ న‌టించిన చిత్రం 'కోబ్రా'. ఆగ‌స్టు 31న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వ‌ద్ద ఫ‌ర్వాలేద‌నిపించింది. విక్ర‌మ్ డిఫ‌రెంట్ గెటప్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. మ‌ది పాత్ర‌లో న‌ట‌న‌కు గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. తాజాగా డిజిట‌ల్ రిలీజ్‌కు సంబంధించిన తేదీ ఫిక్సైంది.

ఈ చిత్ర డిజిట‌ల్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ సోని లివ్ ద‌క్కించుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 28 నుంచి స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు ట్వీట్ చేసింది. ఈ మేర‌కు ఓ కొత్త ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. అయితే.. ఇక్క‌డ ఓ చిన్న విష‌యం ఉంది. ఈ చిత్ర ఓటీటీ లో స్ట్రీమింగ్ తేదీని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికి ఏ యే భాష‌ల్లో ఉంటుంద‌నే విష‌యాన్ని మాత్రం చెప్ప‌లేదు. ట్వీట్‌ను బ‌ట్టి త‌మిళ వ‌ర్ష‌న్‌లో స్ట్రీమింగ్ ఉండ‌నుంది.

కేజీఎఫ్ ఫేమ్‌ శ్రీనిధి శెట్టి, మృనాళిని ర‌వి హీరోయిన్‌లుగా న‌టించగా.. ప్ర‌ముఖ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ఖాన్ కీల‌క‌పాత్ర‌ను పోషించాడు. మ‌ల‌యాళ న‌టుడు రోష‌న్ మాథ్యూ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టించాడు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్‌ స్టూడీయో ప‌తాకంపై ఎస్.ఎస్ ల‌లిత్‌కుమార్ నిర్మించగా ఏఆర్. రెహమాన్ సంగీతాన్ని అందించారు.

Next Story