ఫైట్ చిత్రీకరణలో మ‌రోసారి తీవ్రంగా గాయ‌ప‌డిన విశాల్‌.. వీడియో వైర‌ల్‌

Climax stunt sequence Vishal back got injured severely.ప్ర‌ముఖ కోలీవుడ్ హీరో విశాల్ మ‌రోసారి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 July 2021 7:15 AM GMT
ఫైట్ చిత్రీకరణలో మ‌రోసారి తీవ్రంగా గాయ‌ప‌డిన విశాల్‌.. వీడియో వైర‌ల్‌

ప్ర‌ముఖ కోలీవుడ్ హీరో విశాల్ మ‌రోసారి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. త‌న కొత్త సినిమా క్లైమాక్స్ షూటింగ్‌లో భాగంగా యాక్ష‌న్ సీక్వెన్స్ తెర‌కెక్కిస్తున్న క్ర‌మంలో ఆయ‌న గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం విశాల్ హీరోగా 'నాట్ ఏ కామ‌న్ మ్యాన్' అనే చిత్రం తెర‌కెక్కుతోంది. శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుటుంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో విశాల్ విభిన్న‌మైన లుక్‌లో క‌నిపించ‌నున్నారు. విశాల్ కెరీర్‌లో 31వ చిత్రంగా వ‌స్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఇందులో విశాల్‌పై యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఫైట్ సీక్వెన్స్‌లో భాగంగా బ‌లంగా గోడ‌ను ఢీకొని విశాల్ కింద‌ప‌డిపోయాడు.

ఈ ప్ర‌మాదంలో వెన్ను భాగానికి గాయ‌మైంది. దీంతో వెంట‌నే ఆయ‌న‌కు చికిత్స అందించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని చిత్ర బృందం వెల్ల‌డించింది. కాగా.. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా.. గ‌తంలో కూడా ఈ చిత్ర షూటింగ్‌లో విశాల్ గాయ‌ప‌డ్డాడు. స‌మ‌న్వ‌య లోపంతో ఆయ‌న త‌ల‌కు, కంటికి స్వ‌ల్ప‌గాయాలైన విష‌యం తెలిసిందే.

Next Story
Share it