హాలీవుడ్ మూవీ షూటింగ్‌లో అపశృతి.. పేలిన్ గన్.. మహిళా సినిమాటోగ్రాఫర్ మృతి
Cinematographer dies after prop gun fired.హాలీవుడ్ మూవీ షూటింగ్‌లో అపశృతి చోటు చేసుకుంది. చిత్రీకరణలో భాగంగా
By తోట వంశీ కుమార్ Published on 22 Oct 2021 10:50 AM ISTహాలీవుడ్ మూవీ షూటింగ్‌లో అపశృతి చోటు చేసుకుంది. చిత్రీకరణలో భాగంగా ప్రాప్‌గన్‌తో కాల్పులు జరుపగా చీఫ్ సినిమాటోగ్రాఫర్ మృతి చెందగా.. దర్శకుడికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం దర్శకుడి పరిస్థతి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన అమెరికాలోని న్యూ మెక్సికోలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. శాంటా ఫె కంట్రీలోని బొనాంజా క్రీక్ రాంచ్‌లో 'రస్ట్' మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు అలెక్ బాల్డ్‌విన్ హీరోగా నటిస్తుండగా.. జోయెల్ సౌజా దర్శకత్వం వహిస్తున్నారు. ఓ 13 ఏళ్ల బాలుడు తన తాతతో కలిసి పరారీ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. జైలు నుంచి తప్పించుకున్న తాత.. తన మనువడితో కలిసి ఓ ఇంట్లో తలదాచుకుంటాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు, అలెక్స్ మధ్య కాల్పులు చోటు చేసుకుంటాయి. ఈ కాల్పుల సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
సన్నివేశంలో భాగంగా హీరో అలెక్ బాల్డ్‌విన్ ప్రాప్ గన్ తో కాల్పులు జరుపుతున్నాడు. ఆ ప్రాప్ గన్ నుంచి బుల్లెట్లు దూసుకొచ్చాయి. ఈ బుల్లెట్లు మహిళా చీఫ్ సినిమాటోగ్రాఫర్ హెలైనా హచిన్స్, దర్శకుడు జోయెల్ సౌజాను తాకాయి. దీంతో వారు రక్తపు మడుగులో పడిపోయారు. వెంటనే వారిని హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. హెలైనా హచిన్స్ చికిత్స పొందుతూ మరణించింది. ఆమె వయస్సు 42 సంవత్సరాలు. దర్శకుడు జోయెల్ సౌజా పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న న్యూమెక్సికో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అలెక్ బాల్డ్‌విన్ ఉపయోగించిన ప్రాప్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే కాల్పులు జరిపాడా..? లేదా ప్రమాదవశాత్తు జరిగిందా..? అనే దానిపై దర్యాప్తు చేప్టటారు. ప్రత్యక్ష సాక్షులను విచారించగా.. ప్రాప్‌గన్ మిస్‌ఫైర్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు.