తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు తదితరులు హాజరయ్యారు. అద్దె ప్రాతిపాదికన సినిమాలను ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు. పర్సంటెజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్ల తీర్మానం చేశారు. ఎగ్జిబిటర్ల నిర్ణయాన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్, ప్రొడ్యూసర్ గిల్డ్ లకు తెలుగు ఫిలిం ఛాంబర్ తెలుపనున్నారు. ప్రొడ్యూసర్లు తమకు సహకరించకపోతే జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్ల నిర్ణయం తీసుకున్నారు.
కాగా, గతంలోనూ ఎగ్జిబిబర్లు ఈ తరహా డిమాండ్ చేశారు. కాకపోతే అప్పుడు.. సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో ఇకపై అద్దె ప్రాతిపదికన కాకుండా వాటాల విధానంలోనే సినిమాలను ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. బెనిఫిట్ షోలు, అదనపు ఆటలను ప్రదర్శించడం వల్ల నష్టపోతున్నామని.. అందువల్ల వాటిని కూడా నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలంగాణ ఎగ్జిబిటర్స్, నిర్వహణ అసోసియేషన్ సభ్యులు నాడు ప్రకటించారు.