మ‌న‌సుకు హ‌త్తుకుంటున్న 'చుక్క‌ల మేళం' పాట‌

Chukkala Melam Lyrical song out.యంగ్ హీరో సుధీర్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Aug 2021 6:59 AM GMT
మ‌న‌సుకు హ‌త్తుకుంటున్న చుక్క‌ల మేళం పాట‌

యంగ్ హీరో సుధీర్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ప‌లాస 1978 ఫేమ్ క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు స‌ర‌స‌న ఆనంది హీరోయిన్‌గా న‌టిస్తోంది. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగ‌స్టు 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేసింది. అందులో భాగంగా నేడు ఈ చిత్రం నుంచి మ‌రో లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు.

'చుక్కల మేళం .. దిక్కుల తాళం .. ఒక్కటయే ఈ సంబరం .. ఆ సాంతం నీ సొంతం' అంటూ ఈ పాట సాగుతోంది. కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించ‌గా అనురాగ్ కులకర్ణి పాడారు. ఖవాలి వరుసల్లో మణిశర్మ ఈ బాణీ కట్టారు. కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం అనురాగ్ కులకర్ణి ఆలాపనతో ఈ పాట సాగింది. ఈ పాట మ‌న‌సుకు హ‌త్తుకునేలా ఉంది. ఈ చిత్రంలో పావెల్ నవగీతన్, నరేష్, మోనోజిత్ శిల్, అరిపిరాల సత్యప్రసాద్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్ష వర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రోహిణి, స్నేహ గుప్త సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఓసారి ఈ పాట‌ను వినేయండి.

Next Story