'తంగలాన్' టీజర్ రిలీజ్.. భయంకరమైన లుక్‌లో విక్రమ్
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న తాజా సినిమా 'తంగలాన్'. ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
By అంజి Published on 1 Nov 2023 12:36 PM IST'తంగలాన్' టీజర్ రిలీజ్.. భయంకరమైన లుక్‌లో విక్రమ్
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న తాజా సినిమా 'తంగలాన్'. ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ గింప్ల్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల వద్ద నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. టీజర్ చూస్తే.. రోమాలు నిక్కబోడుచుకోవడం ఖాయం. తమిళ్ అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బంగారు గనుల దగ్గర ఉండే ప్రజలకు, ఆంగ్లేయులకు మధ్య వార్ సీన్లు కనిపిస్తున్నాయి. ఈ టీజర్‌లో విక్రమ్ చాలా భయంకరమైన లుక్‌లో కనిపిస్తున్నాడు. ఒక వైపు కత్తి పట్టుకొని అందరిని నరికేస్తూ.. మరోవైపు పాముని రెండు ముక్కలుగా చేసి పడేస్తున్నట్టు చూపించారు.
టీజర్ గమనిస్తే.. బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ సాగే స్టోరీ అని తెలుస్తుంది. కొన్ని వందల ఏళ్ళ క్రితం కథ అని, కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథల ఆధారంగా ఈ సినిమాని తీస్తున్నారని సమాచారం. ఈ సినిమా జనవరి 26న పాన ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో మాళవికా మోహనన్, పార్వతి తిరువొతు ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. పశుపతి, డానియెల్ కల్టగిరోన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాను స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
The son of Gold rises🔥⚔️Unveiling the spine-chilling #ThangalaanTeaser✨▶️https://t.co/wwv4jcrvfN#Thangalaan #ThangalaanFromJan26@Thangalaan @chiyaan @kegvraja @StudioGreen2 @officialneelam @parvatweets @MalavikaM_ @PasupathyMasi @DanCaltagirone @thehari___… pic.twitter.com/tGlsOmCo1K
— pa.ranjith (@beemji) November 1, 2023