చిరు మూవీ టైటిల్‌ను చెప్పేసిన మ‌హేష్ బాబు

Chiru new movie title is Bholaa Shankar.స్వ‌యంకృషికి చిరునామా.. మంచిత‌నానికి మారు పేరు.. ఓర్పుకి నిలువెత్తు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Aug 2021 3:53 AM GMT
చిరు మూవీ టైటిల్‌ను చెప్పేసిన మ‌హేష్ బాబు

స్వ‌యంకృషికి చిరునామా.. మంచిత‌నానికి మారు పేరు.. ఓర్పుకి నిలువెత్తు నిద‌ర్శ‌నం మెగాస్టార్ చిరంజీవి. జీవితంలో ఎత్తు ప‌ల్లాల‌ని చూసిన చిరంజీవి ఈ రోజు ప్ర‌జ‌ల గుండెల్లో దేవుడిగా మారాడు. న‌టుడిగానే కాదు సామాజిక సేవ‌కుడిగా కూడా అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నాడు చిరు. నేడు 66వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్న చిరుకి సినీ, క్రీడా, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్రస్తుతం చిరంజీవి.. 'ఆచార్య' చిత్రం చేస్తుండ‌గా, ఇటీవ‌ల లూసిఫ‌ర్ రీమేక్ మొద‌లు పెట్టాడు. త్వ‌ర‌లో వేదాళం రీమేక్ చేయ‌నున్నాడు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలోను ఓ మూవీ చేయ‌బోతున్నాడు మెగాస్టార్. ఇక నేడు చిరు పుట్టిన రోజు సంద‌ర్భంగా వ‌రుస‌గా మెగాస్టార్ చిరంజీవి సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్ రానున్నాయి.

శ‌నివారం రోజు చిరంజీవి హీరోగా మోహన్ రాజా తెర‌కెక్కిస్తున్న లూసిఫ‌ర్ రీమేక్ టైటిల్ రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే. గాఢ ఫాద‌ర్ అనే టైటిల్ చిత్రానికి ఫిక్స్ చేసిన‌ట్టు పోస్ట‌ర్ ద్వారా రివీల్ చేశారు. ఇక మెహ‌ర్ ర‌మేష్ మూవీకి సంబంధించిన టైటిల్‌ని సూప‌ర్ స్టార్ మ‌హేష్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. వేదాళం రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి భోళా శంక‌ర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ మంచి విజయాలు సాధించాలని మ‌హేష్ ఆకాంక్షించారు. ఈ చిత్రంలో నయనతార, సత్య దేవ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై తెర‌కెక్క‌నున్న ఈచిత్రాన్ని అనిల్ సుంక‌ర నిర్మిస్తున్నారు.

Next Story
Share it