రామ్‌చరణ్‌ను చూసి ఎంతో గర్విస్తున్నానంటూ చిరు ఎమోషనల్ పోస్ట్
Chiru congratulates Ram Charan for winning True Legend.రామ్‌చరణ్‌కు ట్రూ లెజెండ్ అవార్డు రావడం పట్ల
By తోట వంశీ కుమార్ Published on 3 Dec 2022 10:17 AM ISTమెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌కు 'ట్రూ లెజెండ్' అవార్డు రావడం పట్ల అతడి తండ్రి, మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. చరణ్ అవార్డును అందుకోవడం గర్వంగా ఉందని చెప్పాడు. రామ్‌చరణ్ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు మెగాస్టార్. "కంగ్రాట్స్ డియర్ చరణ్. ప్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియాలో ట్రూ లెజెండ్ అవార్డు నువ్వు అందుకున్నందకు గర్విస్తున్నా. నువ్వు ఇలాగే ముందుకు సాగాలని అమ్మా నేను కోరుకుంటున్నాం." అని చిరు ట్వీట్ చేశారు. దీనికి చరణ్ "లవ్ యూ అప్పా" అని రిప్లై ఇచ్చాడు.
వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన పలువురు ప్రముఖులకు ఆదివారం ప్రముఖ ఆంగ్ల ప్రతిక ఎన్డీటీవీ "ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా" అవార్డులను అందజేసింది. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో రామ్‌చరణ్‌కు 'ట్రూ లెజెండ్' అవార్డు లభించింది. ఈ అవార్డును చరణ్ తన తండ్రి చిరంజీవికి అంకితం చేశారు.
Nanna,
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 2, 2022
Absolutely thrilled for you and proud, on winning the #TrueLegend - #FutureOfYoungIndia Award #NDTV
Bravo!!! 👏👏 Way to go, dearest @AlwaysRamcharan
- Appa & Amma pic.twitter.com/6t1wJuvzxy
ఈ కార్యక్రమంలో చరణ్ మాట్లాడుతూ.. చిరంజీవి సేవలను కొనియాడారు. 1997లో మా కుటుంబానికి ఎంతో అప్తుడైన ఓ వ్యక్తి ఆపరేషన్ సమయంలో రక్తం దొరక్క మరణించాడు. రక్తం దొరక్క ఓ మనిషి కన్నుమూయడం షాక్‌కు గురి చేసింది. ఆ బాధ నుంచే నాన్న బ్లడ్ బ్యాంక్‌ను మొదలు పెట్టారు. రక్తదానం చేయండి. తనతో ఫోటో దిగే అవకాశం సొంతం చేసుకోండి అంటూ అభిమానులకు పిలుపునిచ్చారు. అలా.. అప్పుడు, ఇప్పుడు ఆ బ్లడ్ బ్యాంక్ ఎంతో మందికి ఉపయోగపడుతోందని చరణ్ చెప్పారు.