కిషన్‌రెడ్డికి చిరంజీవి విషెస్.. థ్రిల్లింగ్‌గా ఉంద‌ని ట్వీట్

Chiranjeevi wishes Union Minister Kishan Reddy.కేంద్ర మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో కేంద్ర హోంశాఖ స‌హాయ‌క మంత్రి ప‌ద‌వి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 July 2021 12:54 PM IST
కిషన్‌రెడ్డికి చిరంజీవి విషెస్.. థ్రిల్లింగ్‌గా ఉంద‌ని ట్వీట్

కేంద్ర మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో కేంద్ర హోంశాఖ స‌హాయ‌క మంత్రి ప‌ద‌వి నుంచి కేబినెట్ మంత్రిగా కిష‌న్ రెడ్డి పదోన్నతి పొందిన సంగ‌తి తెలిసిందే. మోడీ క్యాబినెట్‌లో కిషన్‌రెడ్డికి పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలు దక్కాయి. ఈ సందర్భంగా ట్విట‌ర్ వేదిక‌గా మెగాస్టార్ చిరంజీవి కిష‌న్‌రెడ్డికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

మన దేశం యొక్క యోగ్యతలను, ప్రత్యేకతలను ప్రపంచానికి తెలియజేయడానికి కిషన్‌ రెడ్డికి మంచి అవకాశం లభించిందన్నారు. ఆ అనుభూతిని, అధికారాన్ని అనుభవించినందుకు థ్రిల్లింగ్‌గా ఉందని చిరంజీవి ట్వీట్‌ చేశారు. కాగా..కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చిరంజీవి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

కిషన్‌రెడ్డి విషయానికి వస్తే.. 2018 చివ‌ర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌రువాత జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి.. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ఎంపీగా కొనసాగుతున్నారు. ఎంపీగా గెలుపొందిన ఆయనకు తొలి ప్రయత్నంలోనే కేంద్ర సహాయ మంత్రి పదవి లభించగా.. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు కేబినెట్‌ బెర్త్‌ దక్కింది.

Next Story