'లాల్ సింగ్ చద్దా ' చిత్రంలో భాగ‌మైన చిరంజీవి

Chiranjeevi to present Telugu version of ‘Laal Singh Chaddha’.బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ న‌టించిన చిత్రం లాల్ సింగ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 July 2022 1:26 PM IST
లాల్ సింగ్ చద్దా  చిత్రంలో భాగ‌మైన చిరంజీవి

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ న‌టించిన చిత్రం 'లాల్ సింగ్ చ‌ద్దా'. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో అక్కినేని నాగ‌చైత‌న్య కీల‌క పాత్ర‌లో న‌టించారు. హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో ఆమిర్ స‌ర‌స‌న కరీనా కపూర్ న‌టించింది. ఈ చిత్రం ఆగ‌స్టు 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డ‌తుండ‌డంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

ఇదిలా ఉంటే.. త‌న మిత్రుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ఆమిర్ ఖాన్ స్పెష‌ల్ ప్రివ్యూని వేశారు. చిరంజీవి నివాసంలో వేసిన ఈ ప్రివ్యూకి నాగార్జున, ఎస్ఎస్ రాజమౌలి, సుకుమార్, నాగచైతన్య హాజ‌ర‌య్యారు. అనంతరం మూవీ పట్ల తమ స్పందనను తెలియజేశారు. మెగాస్టార్, రాజమౌళి, సుకుమార్, నాగార్జున ఆమిర్‌ని ప్రశంసలతో ముంచెత్తారు.

ఈ క్ర‌మంలో చిరంజీవి ఈ చిత్రం గురించి తెలియ‌జేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 'లాల్ సింగ్ చద్దా ఆమిర్ డ్రీమ్ ప్రాజెక్ట్. తన కల నెర‌వేర్చుకోవడమే కాకుండా దీనిలో నాకూ భాగం కలించారు'.అని ట్వీట్‌లో రాసుకోచ్చారు. అలాగే.. మ‌రో ట్వీట్‌లో 'లాల్ సింగ్ చద్దా' సినిమాను తెలుగులో సమర్పిస్తున్నట్టుగా పేర్కొన్నారు.

Next Story