మేము ఏం చేయాలో మాకు తెలియ‌దా..? మీడియా చెప్పే ఎలా..?

Chiranjeevi Speech at God Father Success meet.మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చిత్రం గాడ్‌ఫాద‌ర్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Oct 2022 10:21 AM IST
మేము ఏం చేయాలో మాకు తెలియ‌దా..? మీడియా చెప్పే ఎలా..?

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చిత్రం 'గాడ్‌ఫాద‌ర్‌'. ద‌స‌రా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీసు వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. ఈ క్ర‌మంలో శ‌నివారం రాత్రి ఈ చిత్ర స‌క్సెస్ మీట్‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. త‌న జీవితంలో అత్య‌ద్భుత‌మైన ప‌దిహేను చిత్రాల్లో గాడ్‌ఫాద‌ర్ ఒక‌టి అని అన్నారు.

'ఇంద్ర‌', 'ఠాగూర్ 'త‌రువాత ఆ స్థాయి విజ‌యం అంటుంటే ఆనందంగా ఉంద‌న్నారు. కంటెంట్ ఉంటే ప్రేక్ష‌కులు ఖ‌చ్చితంగా థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని నేనే చెప్పాను. ఈ చిత్రంతో ఆ న‌మ్మ‌కం నిజ‌మైంద‌న్నారు. ఈ చిత్రంలో పారితోషికం కోసం ఎవ్వ‌రూ ప‌నిచేయ‌లేద‌ని, విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ప‌నిచేసిన‌ట్లు చెప్పారు.

మీడియాపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. సినిమా బాగా తీసినా.. మా కాన్ఫిడెంట్ త‌గ్గించేలా మీడియాలో వ‌స్తున్న వార్త‌లు చిరాకు క‌లిగిస్తున్నాయ‌ని అన్నారు. తామేం చేయాలో కూడా మీడియా నిర్ణ‌యిస్తుంటే ఎలా అని ప్ర‌శ్నించారు. సినిమాను ఎప్పుడు ప్ర‌మోట్ చేయాలో, ఎప్పుడు హైలెట్ చేయాలో కూడా మీడియా చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వ‌ర్షం ప‌డిన‌ప్ప‌టికీ త‌న స్పీచ్ ను కొన‌సాగించాన‌ని ఎందుకంటే తాను ఆపితే మీడియా వాళ్లు ఏది ప‌డితే అది రాస్తార‌నే భ‌యంతోనే ఆ కార్య‌క్ర‌మానికి బ్రేక్ రాకుండా చూసుకున్నాన‌ని చెప్పారు. ఇక సినిమా విడుద‌లైన తరువాత ప్ర‌తీ మీడియా బాగా రాసింద‌ని, అందుకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

నిర్మాత ఎన్వీ ప్ర‌సాద్ మాట్లాడుతూ.. ప్ర‌జారాజ్యం విష‌యంలో చాలా మంది చిరంజీవి అమ్ముడుపోయార‌ని అంటున్నారు. మ‌ద్రాస్‌లో ప్ర‌సాద్ ల్యాబ్ ప‌క్క‌న ఉండే కృష్ణ గార్డెన్స్ అనే ఆస్తిని అమ్మి ప్ర‌జారాజ్యం పార్టీ త‌రువాత అప్పులు తీర్చార‌న్నారు. ఇది ప్ర‌పంచానికి తెలియ‌ద‌న్నారు. ప్ర‌జారాజ్యం నుంచి పుట్టిన భాద, ఆవేశ‌మే జ‌న‌సేన‌. ఆ రోజు చిరంజీవి గురించి ఏది ప‌డితే అది మాట్లాడిన వాళ్ల‌కి స‌మాధాన‌మే జ‌న‌సేన అని అన్నారు.

Next Story