వెంక‌టేష్‌కు చిరు విషెష్‌.. ట్వీట్ వైర‌ల్‌

Chiranjeevi special wishes venkatesh.టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒక‌రైన విక్ట‌రీ వెంక‌టేష్ పుట్టిన రోజు నేడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Dec 2022 1:04 PM IST
వెంక‌టేష్‌కు చిరు విషెష్‌.. ట్వీట్ వైర‌ల్‌

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒక‌రైన విక్ట‌రీ వెంక‌టేష్ పుట్టిన రోజు నేడు(డిసెంబ‌ర్ 13). మంగ‌ళ‌వారం ఆయ‌న 62వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ప‌లువురు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెంక‌టేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. మ‌రో అగ్ర‌హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి కూడా వెంకీ కి బ‌ర్త్ డే విషెష్ చెప్పారు.

వెంకీ కి చిరు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది. "మై డియ‌ర్ వెంకీ. హ్యాపి బ‌ర్త్ డే.. వేర్ ఇజ్ ద పార్టీ" అంటూ ట్వీట్ చేశారు. దీనిపై నెటీజ‌న్లు 'వాల్తేరు వీర‌య్య' సాంగ్ బాస్ పార్టీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇది కాస్త ప‌క్క‌న బెడితే.. మెగాస్టార్‌ చిరంజీవి, విక్ట‌రీ వెంకటేష్‌ల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆన్‌ స్క్రీన్‌లో ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉన్నా ఆఫ్‌ స్క్రీన్‌లో మాత్రం ఇద్ద‌రు మంచి మిత్రులు అన్న సంగ‌తి తెలిసిందే. ఎవ‌రి సినిమా ఆడినా ఇద్ద‌రు క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుంటామ‌ని ఓ సంద‌ర్భంలో చిరు చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. వెంకటేష్‌ ప్రస్తుతం హిందీలో సల్మాన్‌ఖాన్‌ 'కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్' చిత్రంలో కీలక పాత్రలో న‌టిస్తున్నాడు. రానాతో కలిసి నటించిన 'రానా నాయుడు' వెబ్‌ సిరీస్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

Next Story