ఫ్యాన్స్‌కు శుభ‌వార్త చెప్పిన చిరంజీవి

Chiranjeevi recovers from COVID-19.మెగాస్టార్ చిరంజీవి అభిమానుల‌కు నిజంగా ఇది శుభ‌వార్తే. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Feb 2022 11:46 AM IST
ఫ్యాన్స్‌కు శుభ‌వార్త చెప్పిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి అభిమానుల‌కు నిజంగా ఇది శుభ‌వార్తే. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి మెగాస్టార్ చిరంజీవి కోలుకున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. తాను కోలుకోవాల‌ని ప్రార్థించిన‌వారంద‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. అంతేకాదు.. బ్యాక్ టూ వ‌ర్క్ అంటూ ట్వీట్ చేశారు.

'క‌రోనా నెగెటివ్‌.. నేను కోలుకోవాల‌ని ప్రార్థించిన వారంద‌రికి మనస్పూర్తిగా ధన్యవాదాలు.. బ్యాక్ టూ వ‌ర్క్‌. పుల్ యాక్ష‌న్ స్ట్రీమ్' అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. షూటింగ్ సెట్‌లో ఉన్న ఫోటోల‌ను అభిమానుల‌తో పంచుకున్నారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో పుల్ బిజీగా ఉన్నారు. ఆయ‌న చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. ఇప్ప‌టికే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య చిత్రాన్ని చిరు పూర్తి చేశారు. ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇదిగాక‌.. గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం సెట్స్‌పై ఉన్నాయి. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'భోళా శంకర్' సినిమా షూటింగ్‌లో చిరంజీవి పాల్గొంటున్నారు.


Next Story