వైఎస్ జగన్ ప్రకటనతో చిరంజీవి ఫుల్ ఖుషీ

Chiranjeevi praises CM Jagan decision.ఈ ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్టు సీఎం జగన్ ప్రకటించడంతో తన హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయిందని తెలిపారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 March 2021 5:31 PM IST
వైఎస్ జగన్ ప్రకటనతో చిరంజీవి ఫుల్ ఖుషీ

కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే..! సీఎం జగన్, కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్ తో కలిసి‌‌ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని.. గతంలో కర్నూలుకు రోడ్డు, రైలు మార్గంలోనే ప్రయాణం ఉండేది. ఇక నుండి విమాన ప్రయాణం కూడా జరగబోతోంది. రాష్ట్రంలో ఇది 6వ విమానాశ్రయమని అన్నారు. ఈ నెల 28 నుంచి విమానాశ్ర‌యంలో రాక‌పోక‌లు జ‌రుగుతాయ‌న్నారు. సిపాయి తిరుగుబాటు కంటే ముందే రైతుల పక్షాన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉద్య‌మం చేశార‌ని, ఆయ‌నకు నివాళిగా ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్టుగా జగన్ ప్ర‌క‌టించారు.

తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్టు సీఎం జగన్ ప్రకటించడంతో తన హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయిందని తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెల్లదొరలపై పోరాట బావుటా ఎగురవేసిన మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఉయ్యాలవాడ అత్యంత గొప్ప దేశభక్తుడని, అయితే చరిత్రలో మరుగునపడిపోయాడని.. అలాంటి వీరుడి పేరు ఎయిర్ పోర్టుకు పెట్టడం అత్యంత సముచిత నిర్ణయమని అన్నారు. అంతటి యోధుడి పాత్రను తెరపై తాను పోషించడం తనకు దక్కిన అదృష్టంగా, గౌరవంగా భావిస్తానని చిరంజీవి తెలిపారు.




Next Story