సీఎంకు రెండు చెక్‌లు ఇచ్చిన చిరంజీవి

ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  16 Sept 2024 2:51 PM IST
సీఎంకు రెండు చెక్‌లు ఇచ్చిన చిరంజీవి

ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దాంతో చాలా చోట్ల వరదలు సంభవించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఇళ్లను కోల్పోయిన ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు. వరద బాధితులసహాయార్ధం మెగాస్టార్ట్‌ చిరంజీవి ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రాకు రూ.50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంట్లో కలిసి సహాయనిధికి రూ. 50 లక్షల విరాళంను చెక్కు రూపంలో అందజేశారు. అలాగే రామ్‌ చరణ్‌ తరఫున మరో 50 లక్షల రూపాయల చెక్కును కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు.

స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి సహాయార్థం మరికొందరు టాలీవుడ్‌ నటులు కూడా చెక్కులు అందజేశారు. టాలీవుడ్‌ హీరో విశ్వక్‌సేన్‌ రూ.10 లక్షల చెక్కు, మరో హీరో సాయిధరమ్‌ తేజ్‌ రూ.10 లక్షలు, కమెడియన్ అలీ రూ.3లక్షలు విరాళంగా సీఎం రేవంత్‌రెడ్డికి చెక్కులు అందజేశారు. వీరంతా సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌ నివాసంలో కలిసి చెక్కులు అందించారు. అమర్‌ రాజా గ్రూప్‌ తరఫున సీఎం సహాయ నిధికి రూ. కోటి విరాళంగా అందజేశారు. ఈ చెక్కును మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి సీఎం రేవంత్‌రెడ్డి అందజేశారు. గరుడపల్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రయివేట్ లిమిటెడ్ తరఫున వరద బాధితుల కోసం రూ.25 లక్షలు విరాళంగా అందజేసింది.



Next Story